Demonetisation in INDIA..
పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థ కు లాభం చేకూర్చిందా?? నష్టం చేకూర్చిందా?? ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చిందా?? వాస్తవాలు..
-->> చలామణిలో ఉన్న నోట్లను ఆ దేశానికి చెందిన కేంద్ర బ్యాంకు/ సెంట్రల్ బ్యాంక్ రద్దు చేయడాన్ని లేదా చలామణిలో లేకుండా చేయడంను నోట్ల రద్దు లేదా డిమానిటైజేషన్ అంటారు.
2016 నవంబర్ 8 వ తారీఖున భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు దేశంలో పెద్ద నోట్లు 500 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు
స్వాతంత్రం తరువాత భారతదేశంలో మొదటిసారిగా 1978 సంవత్సరంలో మొరార్జీదేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పెద్ద నోట్ల రద్దు చేయబడింది అప్పటికి చలామణిలో ఉన్న 500 రూపాయలు 1000 రూపాయలు 10000 రూపాయల నోట్ల రద్దు చేశారు.
2016 నవంబర్ 8 న భారతదేశంలో రెండవసారి పెద్ద నోట్ల రద్దు చేయబడింది.
2016 లో నోట్ల రద్దు జరిగినప్పుడు భారత దేశ జీడీపీలో చలామణిలో ఉన్న నగదును విలువ 12 శాతానికి సమానం అని మరియు భారతదేశంలో మొత్తం నగదు విలువ లో రద్దు చేయబడిన నోట్ల నగదు విలువ దాదాపు 85 శాతానికి సమానమని మరియు మొత్తం రద్దు చేయబడిన నోట్ల సంఖ్య అప్పటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్ల సంఖ్యలో 24.4 శాతానికి సమాన అని నివేదికలు తెలుపుతున్నాయి.
2016లో నోట్ల రద్దు ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు.
1. నల్లధనాన్ని పెద్ద మొత్తంలో అరికట్టడం.
2. అక్రమంగా చలామణిలో ఉన్న దొంగనోట్లను అరికట్టడం.
3. ఉగ్ర నిధులను పెద్ద మొత్తంలో అరికట్టడం.
4. ప్రజల ద్వారా బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతాయని ఆ డిపాజిట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని ప్రభుత్వం ఆశించింది.
5. ప్రజల అక్రమ సంపాదన లపై ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఆశించింది.
6. డిజిటల్ లావాదేవీలు పెద్ద మొత్తంలో పెరుగుతాయని తద్వారా దేశంలో అక్రమ సంపాదన ఉండబోదని ప్రభుత్వం ఆశించింది.
వాస్తవాలు..
1. నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ఆశించిన విధంగా కాకుండా 99.3 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ రంగంలోకి చేరాయి.. దీనిని బట్టి చూస్తే నల్లధనాన్ని నిర్మూలించాలి అనే అంశం పూర్తిస్థాయిలో నెరవేరలేదు.. కారణమేమనగా దేశంలో నల్లధనం బంగారం రూపంలో రియల్ఎస్టేట్ రూపంలో ఉండడం.
2. బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్లు పెరిగి ఆ డిపాజిట్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులు గా మారి దేశంలో పరిశ్రమలు స్థాపించబడి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశించింది కానీ వాస్తవంగా దేశంలో పెద్ద మొత్తంలో ఉపాధి కల్పిస్తున్న రంగాలైన వ్యవసాయం మరియు అసంఘటిత రంగం రెండు రంగాలు కుదేలు అయిపోయాయి. ఈ క్రమంలో 85 శాతం ఉపాధి కల్పిస్తున్న ఈ రెండు రంగాలలో పెద్దమొత్తంలో నిరుద్యోగిత నమోదైంది. ఆ ప్రభావమే ప్రస్తుత ఆర్థిక మందగమనం.
3. నగదు లావాదేవీలు తగ్గించాలి డిజిటల్ లావాదేవీలు పెంచాలని ప్రభుత్వ లక్ష్యం కాగా ప్రస్తుతం పెద్ద మొత్తంలో నిరుద్యోగిత కారణంగా ప్రజల ఆదాయాలు తగ్గి అన్నిరకాల లావాదేవీలు తగ్గిపోయాయి. ప్రజలకు ఖర్చు చేసే శక్తి కూడా తగ్గిపోయింది.
4. చలామణిలో ఉన్న నగదు కు మరియు gdp కి ratio 2019-20 లో 11.3%కాగా 2020-21 లో 12%.. ఇది 2016లో నోట్ల రద్దు సమయంలో ఉన్న శాతానికి సమానం అనగా భారత దేశంలో చలామణిలో ఉన్న నగదు ఏ మాత్రం తగ్గలేదని ఇది తెలుపుతుంది.
5. చలామణి నగదు లో ఉన్న పెరుగుదల వేగం growth rate 2019 లో 16.8% కాగా 2020లో 14.5% అనగా దేశంలో చలామణిలో ఉన్న నగదు పెద్దమొత్తంలో పెరుగుతోంది.
6. దొంగనోట్లను అరికట్టాలి ఉగ్ర నిధులను అరికట్టాలి అన ప్రభుత్వ లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరలేదు అని నివేదికలు తెలుపుతున్నాయి.
No comments:
Post a Comment