1. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15 సభ్యదేశాలు కుదుర్చుకున్న ఒప్పందం RCEP లేదా ప్రాంతీయ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం. నవంబర్15వ తారీఖున ఈ 15 దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి.
2. ప్రధానంగా ఈ దేశాల మధ్య ఆర్థిక పరమైన సహకారం పెంపొందించడానికి ఎగుమతులు దిగుమతులు సులభంగా జరగడానికి ఉద్దేశించినదే ఈ ఒప్పందం.
3. ఈ ఒప్పందంలో ప్రస్తుతమున్న 15 సభ్యదేశాలు:
10ASEAN దేశాలు అనగా థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్, ఇండోనేషియా ఫిలిప్పైన్స్, మలేషియా, బర్మా, బ్రూనై, సింగపూర్.
(TV CLIP of MBBS)+ చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా.
4. ఈ ఒప్పందానికి సంబంధించిన భావన 2012 సంవత్సరంలోనే ప్రారంభమైంది చైనా దేశం ఈ భావనను ప్రారంభించింది ఇదే సమయంలో అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న obama గారు ట్రాన్స్ పసిఫిక్ పార్టిసిపేషన్ అనే కూటమిని తీసుకొచ్చారు.
5. 2016 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ గారు TPP అమెరికా యొక్క ప్రాధాన్యతను విస్మరిస్తోందని TPP నుంచి బయటికి రావడం జరిగింది.
6. డోనాల్డ్ ట్రంప్రు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా అమెరికా మధ్య విభేదాలు పెద్దమొత్తంలో పెరిగాయి అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం, అమెరికా చైనాల మధ్య సుంకాలు ప్రతి సుంకాలు వంటి వివిధ చర్యలతో పాటుగా ఇటీవల వచ్చిన కరోనా వైరస్ వ్యాప్తికి చైనా దేశం పరోక్షంగా కారణమని అమెరికా వ్యాఖ్యానించడం ఇవన్నీ కారణాలవల్ల చైనా అమెరికాల మధ్య విభేదాలు పెద్దమొత్తంలో పెరిగాయి
7.ఈ క్రమంలోనే అమెరికా చైనా నుంచి తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం అమెరికా యొక్క కంపెనీలు తమ ఉత్పత్తులను నిలిపివేయాలని ఆదేశించడం అదే సమయంలో అమెరికా మిత్ర దేశాలు చైనా నుంచి పెట్టుబడుల ఉపసంహరణ డానికి ప్రయత్నించడం ఇవన్నీ కారణాలవల్ల చైనా దేశం తన ప్రాధాన్యతను కాపాడుకోవడానికి ఈ RCEP కూటమిని వేగంగా ముందుకు నడిపింది.
8. కూటమిలో ఉన్న ప్రస్తుత సభ్య దేశాలను బట్టి చూస్తే మొత్తం ప్రపంచంలోని మూడోవంతు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మరియు ప్రపంచ జీడీపీలో 30 శాతం విదేశాల నుంచి వస్తోంది అదేవిధంగా ప్రపంచ వాణిజ్యంలో 29 శాతం మరియు పెట్టుబడులలో 32శాతం ఈ దేశాల నుంచి రావడం జరుగుతోంది.
9. ఈ క్రమంలో ఈ కూటమి ఏర్పాటు వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 18600 కోట్ల డాలర్లు లాభం చేకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు
కూటమి యొక్క ముఖ్య ఉద్దేశాలు:
1. సభ్య దేశాల మధ్య సుంకాలను తగ్గించడం
2. అంతర్జాతీయ సరఫరా గొలుసు లో కూటమి దేశాలు ప్రధాన భాగస్వామిగా ఉండాలనే ఆలోచన.
3. కూటమిలోని దేశాలు ఇతర సభ్య దేశాల్లో పెట్టుబడులకు అవకాశం.
4. భాగస్వామి దేశాల్లో ఎగుమతి దిగుమతులకు అడ్డంకులు తొలగింపు.
5. కూటమి సభ్య దేశాల్లో పెద్ద మొత్తంలో పరిశ్రమల ఏర్పాటు ఉద్యోగ అవకాశాల పెంపు.
6. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధికి అవకాశం కల్పించడం.
భారతదేశం కూటమిలో భాగస్వామ్యం కాకపోవడానికి కారణాలు.
1. కూటమి సభ్య దేశాల నుంచి పెద్ద మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు దేశం లోకి రావడం తద్వారా దేశంలో వ్యవసాయ రంగం ఇబ్బందులకు గురవుతుందని భారతదేశం కూటమిలో చేరలేదు.
2. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో పాల ఉత్పత్తులు దేశం లోకి రావడం తద్వారా దేశంలో పాడిపరిశ్మ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని భారత దేశం కూటమిలో చేరలేదు.
3. కూటమి నిబంధనల ప్రకారం పెట్టుబడులపై ఆంక్షలు తొలగించడం వల్ల చైనా దేశం నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు భారత దేశం లోకి వచ్చి దేశీయంగా ఉన్న పరిశ్రమలు ఇబ్బందులు లోకి వెళ్లే అవకాశం ఉందని భారతదేశం కూటమిలో చేరలేదు.
4. మేకిన్ ఇండియా స్ఫూర్తితో భారతదేశంలో ఏర్పాటైన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు చైనా నుంచి వచ్చే చౌకైన ఉత్పత్తుల వల్ల పెద్ద మొత్తంలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భారత దేశం కూటమిలో చేరలేదు.
5. దేశ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ అంశాన్నైనా ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్లదని నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
చైనా దేశం ఈ కూటమిని పెద్ద మొత్తంలో ముందుకు తీసుకువెళ్లడానికి కారణాలు.
1. చైనా దేశం నుంచి తరలిపోతున్న కంపెనీలను కూటమి దేశాల్లో స్థాపించడం వల్ల నష్టాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన.
2. కూటమిలోని ఇతర దేశాలతో ఆంక్షలు లేని వాణిజ్యం పెంచుకోవడం వల్ల తన కరెన్సీని కూటమిలోని ఇతర దేశాల్లో పెద్ద మొత్తంలో ఉపయోగించడం వల్ల అమెరికా డాలర్ కు ప్రత్యామ్నాయంగా తన కరెన్సీ అభివృద్ధి చేయాలనే ఆలోచన.
తన స్వప్రయోజనాల కొరకు చైనా చేస్తున్న ఈ ఆలోచనలో భారతదేశం భాగస్వామి కాకూడదనే ఉద్దేశంతోనే ఇండియా RCEP కూటమిలో చేరలేదు.
No comments:
Post a Comment