Eenadu Editorial Analysis (21/11/20)..
GST - వస్తు సేవల పన్ను..
దేశంలో పన్నుల వ్యవస్థను సరళతరం చేసిన GST - ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలు..
2017 సంవత్సరం జూలై నెలలో భారతదేశం లో జీఎస్టీ అమల్లోకి రావడం జరిగింది.
122 వ రాజ్యాంగ సవరణ బిల్లు మరియు 101 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో జీఎస్టీ అమల్లోకి రావడం జరిగింది.
ఒకే దేశం ఒకే పన్ను విధానం అనే ప్రాతిపదికన జీఎస్టీ అమల్లోకి రావడం జరిగింది.
GST ద్వారా దేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థ కు దిశానిర్దేశం చేయడం జరిగింది.
జీఎస్టీ ద్వారా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు సాధ్యమైంది
పన్ను చెల్లింపు పద్ధతులు, వ్యాపార నిర్వహణ మరియు రిటర్నుల సమర్పణ సులభతరం అయ్యాయి.
2017 2020 మధ్య ప్రభుత్వం సంబంధించి వచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకొని విధి విధానాలను తరలిస్తూ పన్ను రేట్లలో హేతుబద్దీకరణ ఈ క్రమంలో భారత దేశంలో పన్ను ఎగవేత ల నిర్మూలనకు ఇది ఎంతగానో దోహదపడింది.
ప్రస్తుతం జిఎస్టి కి సంబంధించి రెండు ప్రధానమైన వాదనలు ఉన్నాయి
1.GST అద్భుత విజయం సాధించిందని
2.GST విధానపరమైన వైఫల్యం అని.
వాదనలు ఏమైనప్పటికీ ప్రస్తుతం భారతదేశం సులభతరం వ్యాపార నిర్వహణ సూచి లో 2020 సంవత్సరానికి 63 వ స్థానం సంపాదించింది.
2016 సంవత్సరంలో ఈ యొక్క సూచీలో భారత్ స్థానం 130.
అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఒక దేశంలో పెట్టుబడి పెట్టడానికి పరిగణలోకి తీసుకునే అతి ప్రధానమైన అంశం చికాకులు లేని పన్నుల వ్యవస్థ.
జిఎస్టి ద్వారా భారతదేశంలో చికాకులు లేని పన్నుల వ్యవస్థ సాధ్యమైంది ఈ క్రమంలోనే మన భారతదేశం సులభతర వ్యాపార నిర్వహణ సూచీలో వేగంగా ముందుకు వెళ్ళింది.
జిఎస్టి అమలులోనికి వచ్చిన తర్వాత భారత దేశంలో పన్నుల వ్యవస్థ లోకి వచ్చిన వారి సంఖ్య వేగంగా పెరిగింది 2017 లో ఈ సంఖ్య 38 లక్షలు కాగా 2020 లో ఈ సంఖ్య 1.23 కోట్లు
జిఎస్టి ని మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వే బిల్స్ మరియు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
జీఎస్టీ అమలు లోనికి వచ్చిన తర్వాత ఒక సంస్థ చేస్తున్న వ్యాపారాలపై పూర్తిగా తెలుసుకోవడం సులభమైంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థల పై అవగాహన పెరగడం వల్ల రుణాల లభ్యత మెరుగైంది. సులభంగా రుణాలు లభిస్తున్నాయి.
జీఎస్టీ ఇంతవరకూ భారతదేశంలో పన్ను వ్యవస్థలో ఎన్నో అంశాలలో సరళత్వం తీసుకొచ్చింది అయితే ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలు
1. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించడం.
జిఎస్టి చట్టం అమలులోనికి వచ్చినపుడు రాష్ట్రాలు జీఎస్టీ ని వ్యతిరేకించాయి. కారణం రాష్ట్రాల యొక్క ఆదాయం పెద్ద మొత్తంలో తగ్గడం. దీనికి ప్రతిగా కేంద్రం రాష్ట్రాలకు 5 సంవత్సరాలపాటు లోటును భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లోటు భర్తీ చేయడానికి కేంద్రం దగ్గర డబ్బు అందుబాటులో లేదు ఈ క్రమంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలు పెరుగుతున్నాయి. 2022 తర్వాత కేంద్రం ఈ లోటును భర్తీ చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం చాలా తగ్గిపోయే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ఈ అంశంపై మరొకసారి దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
2. మారుతూ ఉండే జీఎస్టీ నిబంధనలకు వ్యక్తిగత సంస్థలు చిన్న తరహా సంస్థలు కట్టుబడి ఉండేలా చేయడం అనేది రెండవ సమస్య.
ఈ చిన్న తరహా సంస్థలు, వ్యక్తిగత సంస్థలో వాటికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే యంత్రాంగాన్ని రూపొందించాలి.
GSTR1, GSTR3B, ITC, E-waybill, E-invoice వంటి విధానాలు అమలులో ఉన్న క్రమంలో వాటిపై అవగాహన లేకపోతే వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉండదు ఈ క్రమంలో ప్రభుత్వమే ఈ అంశాలపై వ్యాపారులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
3) క్లెయిమ్ రిఫండ్ కి సంబంధించిన అంశం.
క్లెయిమ్ రిఫండ్ కి సంబంధించి ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలి. ప్రస్తుతం ఈ రిఫండ్ కొరకు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వేగవంతంగా రిఫండ్ అందర వల్ల సంస్థలు అనవసర రుణాలు తీసుకోవాల్సిన అవసరం నుంచి బయటపడతాయని తద్వారా సంస్థల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
4) నకిలీ ఇన్వాయిస్ ల సమస్య నాలుగవ సమస్య
ప్రస్తుతం ఈ నకిలీ ఇన్వాయిస్ ల సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అనే విధానాన్ని తీసుకు వచ్చింది కానీ ఇవి పూర్తి స్థాయిలో అమలు జరగలేదు.
ఈ క్రమంలో ప్రభుత్వం ఈ సమస్యలన్నీ వేగవంతంగా పరిష్కరించినట్లు అయితే భారత దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ విధానం ఎంతగానో తోడ్పడుతుంది
No comments:
Post a Comment