Eenadu Editorial Analysis (20/11/20)..
COVID Reinfection
కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారికి మళ్లీ వ్యాధి సంక్రమిస్తుందా??
కరోనా వైరస్ మానవుని శరీరంలోకి ప్రవేశించి శరీరంలోని కణజాలాన్ని ఉపయోగించుకొని తన సంఖ్యను పెద్ద మొత్తంలో వృద్ధి చేసుకొని శరీరం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం మానవుని శరీరం పుట్టుకతోనే పెద్ద మొత్తంలో రక్షక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటుంది. ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన వైరస్ కి మానవుని శరీరంలోని రక్షణ వ్యవస్థ ప్రతిరక్షక కణాలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. వీటినే యాంటీబాడీస్ అంటారు.
ఒకసారి ఉత్పత్తి చేయబడిన ఈ ప్రతిరక్షకాలు మానవునికి జీవితకాలం నిరోధకతను సంపాదించి పెడతాయి.
ఈ వ్యాధిబారిన పడినవారికి ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేయబడి ఉంటాయి కానీ వ్యాధి బారిన పడని వారికి శరీరంలో ప్రతిరక్షకాల ఉత్పత్తి కావడం కొరకు వ్యాక్సిన్ను ఇస్తారు. ఈ వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి నిర్వీర్యం చేయబడిన వైరస్ చొప్పించబడుతుంది. శరీరంలోని రక్షణ వ్యవస్థ ఈ నిర్వీర్యం చేయబడిన వైరస్కు ప్రతి రక్షక కణాలను ఉత్పత్తి చేసి శరీరాన్ని ఎప్పుడూ పోరాటానికి సిద్ధం గా ఉంచుతుంది. శరీరంలో ఉండే t cells శరీరంలో ప్రతిరక్షక వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి ఉపయోగపడతాయి.
సాధారణ మానవుని లో శరీరంలోకి ప్రవేశించిన వైరస్కు ప్రతిరక్షకాలు నాలుగు నుంచి ఆరు రోజుల్లో తయారవుతాయి. ఇవి తాత్కాలికంగా వైరస్ను నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడతాయి అదే విధంగా మానవ శరీరం దీర్ఘకాలంలో వైరస్ బారినుండి కాపాడుకోవడానికి రెండు నుంచి మూడు వారాల్లో దీర్ఘకాల ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ దీర్ఘకాల ప్రతిరక్షకాలు మానవునికి జీవితాంతం నిరోధకతను సంపాదించి పెడతాయి.
కొంతమందిలో వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత 90 రోజులకు మళ్లీ వైరస్ బారిన పడటం గమనించారు. దీనినే రీ ఇన్ఫెక్షన్ అంటున్నారు.
కొంత మందిలో వారి శరీర నిర్మాణం, వారు తీసుకునే పోషక స్థాయి, మొదటిసారిగా వైరస్ బారిన పడిన ప్రభావం, ఇవన్నీ కారణాల వల్ల వారి శరీరం దీర్ఘకాల ప్రతి రక్షక కణాలను ఉత్పత్తి చేసుకో లేకపోవడమే రెండవసారి వైరస్ బారిన పడడానికి కారణం అని నిపుణుల అంచనా.
అదేవిధంగా రెండవ సారి వైరస్ బారిన పడడానికి రెండవ కారణం వైరస్ జన్యురూపం మార్చుకోవడం. వైరస్ జనాలు రూపాన్ని మార్చుకోవడం వల్ల శరీరంలో ఉండే రక్షక వ్యవస్థ నూతనంగా వచ్చిన వైరస్ ని గుర్తించకపోవడం వల్ల అప్పటికే ఉత్పత్తి అయిన ప్రతిరక్షకాలు ఆ వైరస్ ని ఏమీ చేయలేక పోవడం వల్ల శరీరంపై వైరస్ ప్రభావం చూపిస్తుంది.
అయితే శాస్త్రీయంగా కరోనా వైరస్ జన్యురూపం మార్చుకుంటుంది అనడానికి ఆధారాలు పూర్తి స్థాయిలో లేవు.
నిపుణుల అంచనా ప్రకారం ఒకవేళ వైరస్ జన్యురూపం మార్చుకుంటే ఇప్పుడు ఉత్పత్తి చేయబడుతున్న వ్యాక్సిన్ ప్రభావం చూపదు అంటున్నారు కారణం ఏమనగా వ్యాక్సిన్ ద్వారా ఉత్పత్తి అయిన ప్రతి రక్షకాలు జన్యురూపం మార్చబడిన వైరస్ను ఏమీ చేయలేవు.
No comments:
Post a Comment