దేశంలో విద్యుత్ రంగానికి సంబంధించి మూడు రకాల సంస్థలు సేవలందిస్తున్నాయి
1. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు genco
2.విద్యుత్ సరఫరా సంస్థలు transco
3.విద్యుత్ పంపిణీ సంస్థలు discom.
ప్రస్తుతం వివిధ సమస్యల కారణంగా డిస్కంలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాయి.
విద్యుత్ ఉత్పత్తి సంస్థలు (Genco లు )విద్యుత్ ను ఉత్పత్తి చేస్తే Transco సంస్థలు విద్యుత్ సరఫరా చేస్తాయి మరియు డిస్కంలు విద్యుత్ను పంపిణీ చేస్తాయి.
పంపిణీ చేయబడిన విద్యుత్ కి సంబంధించిన బిల్లులను వసూలు చేసే బాధ్యత డిస్కంలదే. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్త సబ్సిడీ విద్యుత్తు హామీలు ఉండటం వల్ల డిస్కమ్లకు పూర్తిస్థాయి బిల్లులు వసూలు కావడం లేదు.
ఈ క్రమంలోనే డిస్కంలు ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించడం లేదు దీని వల్ల ఉత్పత్తి సంస్థల పై భారం పెరుగుతోంది అదే సమయంలో డిస్కంలు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన మొత్తం బాకీ పడిపోయాయి.
ప్రస్తుతం ఈ అప్పుల విలువ ఒక లక్షా ఇరవై వేల కోట్లుగా ఉంది అనే అంచనా. 3 సంవత్సరాల క్రితం డిస్కంల యొక్క విలువ ఒక లక్ష కోట్లుగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉదయ్ (UDAY )అనే పథకం తీసుకురావడం ద్వారా డిస్కంలపై భారాన్ని తగ్గించింది. కానీ ప్రస్తుతం మళ్లీ దాదాపు లక్ష కోట్ల అప్పులు ఉన్న క్రమంలో డిస్కంల పునరుద్ధరణ గురించి కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆలోచిస్తోంది.
2. భారతదేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 3లక్షల 71 వేల మెగావాట్లు గా ఉంటే మనం అందులో కేవలం 48 శాతం అనగా ఒక లక్షా 76 వేల మెగావాట్లు మాత్రమే వినియోగిస్తున్నారు అంతేకాకుండా కరోనా కాలంలో భారతదేశంలో విద్యుత్ వినియోగం 9.1 శాతం తగ్గిందని అంచనా.
విద్యుత్ వినియోగం తగ్గినట్లయితే ఉత్పత్తి సంస్థలకు మరియు పంపిణీ సంస్థలకు రెండిటికీ నష్టమే. ఈ క్రమంలోనే పంపిణీ సంస్థల యొక్క అప్పులు ఒక లక్ష కోట్లు దాటినట్లు గా అంచనా వేస్తున్నారు.
2021 22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో విద్యుత్ ఛార్జీల పెంచనట్లయితే డిస్కంల మనుగడ కష్టం అని డిస్కంలు అంటున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం నవంబర్ చివరి కల్లా డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ నియంత్రణ మండలి తమ యొక్క విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను సమర్పించాలి కానీ విద్యుత్ చట్టం లో చెప్పబడిన ఈ అంశం ఇప్పటికీ పూర్తిస్థాయిలో నెరవేరటంలేదు.. గత సంవత్సరం దేశంలో 11 రాష్ట్రాలు ఈ ప్రతిపాదనలు సమర్పించలేదు.
భారతదేశంలో భారత ఇంధన ఎక్స్చేంజ్ అనేది ఏర్పాటు చేయబడింది ప్రధానంగా రాష్ట్రాలలో ఉన్న మిగులు విద్యుత్ను కొనుగోలు చేసి మరియు విద్యుత్ అవసరం ఉన్న రాష్ట్రాలకు విద్యుత్ అమ్మడానికి ఈ ఎక్స్చేంజ్ పనిచేస్తుంది. 2008 సంవత్సరంలో ఒక యూనిట్కు సగటున ఉన్నా 7.29 rsమొత్తము 2020 సంవత్సరానికి 2.49rs తగ్గిపోయింది ప్రధాన కారణం డిమాండ్ తగ్గడం.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం డిస్కమ్లకు భారత్ అభియాన్ కింద 90 వేల కోట్లు కేటాయించి ఉత్పత్తి సంస్థలకు చెల్లించే మొత్తాన్ని చెల్లించే విధంగా ఏర్పాటు చేసింది. అయితే ఈ మొత్తము అప్పుగా నే ఉన్నందువల్ల డిస్కంలపై ఇది కూడా భాగంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు
ప్రస్తుతం భారతదేశంలో 15 రాష్ట్రాలలో కేవలం 80 శాతం మాత్రమే విద్యుత్ బిల్లులు ఇవ్వబడుతున్నాయి. ఇచ్చిన విద్యుత్ బిల్లులో కి సంబంధించిన మొత్తంలో ఏ రాష్ట్రం కూడా 100% వసూలు చేయడం లేదు. దీనివల్ల డిస్కంలపై తీవ్రమైన భారం పడుతోంది.
ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం నూతనంగా ప్రీపెయిడ్ మీటర్లు, వ్యవసాయ విద్యుత్కు మీటర్లు అనే ప్రతిపాదన తీసుకు రావడం జరిగింది.
దీనివల్ల ముందుగానే చెల్లించిన మొత్తానికే విద్యుత్తు వినియోగదారునికి అందించడం జరుగుతుంది. వ్యవసాయ విద్యుత్కు మీటర్లు బిగించడం వల్ల సరఫరాలో నష్టాలు పూర్తిస్థాయిలో అంచనాకు రావడానికి సాధ్యమవుతుంది.
అయితే ఈ ప్రతిపాదనలపై కూడా కొన్ని విమర్శలు అనేవి ఉన్నాయి మరియు భారత దేశంలో ప్రస్తుతం discom లను ప్రైవేట్ వారికి అప్పగించాలని నూతన విద్యుత్ చట్టం సవరణ లో చేర్చారు. దీనివల్ల డిస్కంలు లాభ పడతాయని ప్రభుత్వం ఆలోచన.
నిపుణుల ప్రకారం గా ప్రతి సంవత్సరం డిస్కంలు జరపాల్సిన ఆడిటర్ తప్పకుండా జరిపినట్లయితే అవకతవకలకు ఆస్కారం ఉండదని డిస్కంలలో సమస్యలు ఉండవని నిపుణుల సూచన..
No comments:
Post a Comment