NEP - 2020 STARS Project..
నూతన జాతీయ విద్యా విధానం-2020 అమలులో భాగంగా STARS Project..
1. భారతదేశంలో 1968వ సంవత్సరంలో మొదటి సారిగా కమిషన్ సిఫార్సుల మేరకు మొదటి జాతీయ విద్యా విధానం అమలులోకి రావడం జరిగింది కానీ ఆ సమయంలో విద్య రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం కారణంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు పూర్తి స్థాయిలో అమలు చేయబడలేదు.
2 ఆ క్రమంలోనే ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో కి మార్పు చేసింది తద్వారా విద్య కి సంబంధించి కేంద్రం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడింది.
3. ఆ తర్వాతి క్రమంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా 1986వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశంలో రెండవ జాతీయ విద్యా విధానం అమలులోకి రావడం జరిగింది. కానీ మన లక్ష్యం గా ఉన్నా 100% అక్షరాస్యత అనేది సాధ్యపడలేదు.
4. ఈ క్రమంలోనే ప్రభుత్వం 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చింది 21A ప్రకరణ లో విద్యను ప్రాథమిక హక్కుగా చేరుస్తూ ఉచిత నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి అందించాలని నిబంధనలు రూపొందించారు. అంతేకాకుండా ఆదేశిక సూత్రాల్లో 45వ ప్రకరణాలో 0 నుంచి 6 సంవత్సరాల వయసు వారికి అందించడం ప్రభుత్వ బాధ్యతగా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రాథమిక విధుల్లో 51A k లో ఇదే విషయాన్ని చేర్చడం జరిగింది
5. అయినప్పటికీ మన లక్ష్యమైనా 100% అక్షరాస్యత ఇప్పటికీ నెరవేరలేదు ఈక్రమంలోనే ప్రభుత్వం కస్తూరి రంగన్ కమిటీ ని 2015లో ఏర్పాటు చేయడం కస్తూరి రంగన్ కమిటీ సిఫారసుల మేరకు భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 లో అమలులోకి రావడం జరిగింది.
ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్య కి సంబంధించి విధివిధానాలు రూపొందించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాల విద్యకు సంబంధించి ప్రభుత్వం STARS Project ని తీసుకురావడం జరిగింది..
ఈ ప్రాజెక్టుకు ఐదు వేల 5718 కోట్లు అంచనా వ్యయం కాగా ప్రపంచ బ్యాంకు ఈ కార్యక్రమానికి 3,700 కోట్ల మేర సహాయం అందించనుంది..
STARS - Strengthening Teaching Learning And Results for States.
ప్రధానంగా భారతీయ మూలాలను గుర్తించి ప్రపంచీకరణను అనుసంధానం చేస్తూ మానవ విలువలు,వ్యక్తిత్వ వికాసం, ఉత్తమ పౌరుడి లక్షణాలు అలవడి ఎందుకు పాఠశాల విద్య దశలోనే పిల్లల లో ప్రజ్ఞా పాటవాలను పెంచి వివేకవంతులు గా తీర్చి దిద్దాలని ఉద్దేశంతో బోధన అభ్యసన ఫలితాలను బలోపేతం చేసే దిశగా STARS Project ను తీసుకురావడం జరిగింది..
బట్టీపట్టి చదివి పరీక్షలు రాయడం కాకుండా సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటూ నేర్చుకోవడం అనే ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు పేర్కొన్నారు.
21వ శతాబ్దపు పాఠశాల విద్య సదస్సులో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థులు అందుకుంటున్నది మార్కుల షీట్లు కావని అవి pressure sheets అని పేర్కొన్నారు. ఈ పరిణామాలను దూరం చేయడానికే నూతన జాతీయ విద్యా విధానం లో వివిధ మార్పులు తీసుకు వచ్చినట్లుగా చెప్పడం జరిగింది.
STARS Project లో భాగంగా స్వయంప్రతిపత్తి గల 'సమగ్ర అభివృద్ధి కోసం సామర్థ్య అంచనా సమీక్ష జ్ఞాన విశ్లేషణ సంస్థ' ఏర్పాటు చేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలో బోర్డులు విద్యార్థుల పనితీరు అంచనా మూల్యాంకన కోసం స్వయం ప్రతిపత్తి సంస్థ నిబంధనలను రూపొందిస్తోంది.
మొదటగా హిమాచల్ప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కేరళ ఒరిస్సా రాష్ట్రాలలో పరివర్తన వ్యూహాలు మెరుగుపరచడం తమ అనుభవాలను ఇతర రాష్ట్రాలతో పంచుకోవడం ఈ సంస్థ పర్యవేక్షణలో జరుగుతుంది.
విద్య ఉపాధి అవకాశాలకు మనదేశంలో సారూప్యత చాలా తక్కువగా ఉన్న క్రమంలో వృత్తి విద్య పాఠశాల స్థాయిలోనే నూతన జాతీయ విద్యా విధానం లో నిబంధనలు తీసుకురావడం జరిగింది ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావడం ఈ పథకంలో భాగంగా జరగబోతోంది.
2030 సంవత్సరం తర్వాత భారతదేశంలో సమగ్ర శిక్షణ పొందినవారు మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు కు అర్హులు అని నిబంధనలు రూపొందించారు
దేశంలో సరైన రోడ్డు సౌకర్యాలూ బస్సు సదుపాయాలు లేని ప్రాంతాల్లో సాంకేతికతను ఉపయోగించి రిమోట్ లెర్నింగ్ ద్వారా విద్యార్థలకు విద్యను అందించాలనే ప్రయత్నం జరుగుతోంది.
ప్రస్తుతం విద్యా ఉమ్మడి జాబితాలోని అంశం కావడం వల్ల దేశంలో ఒకే దేశం ఒకే విద్యావిధానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అయితే భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతుల కారణంగా ఈ ప్రయత్నానికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు
No comments:
Post a Comment