Sunday, 8 November 2020

వ్యవసాయరంగంలో పెరుగుతున్న సమస్యలు, రైతుకు లభించని గిట్టుబాటు ధరలు, కొరవడిన ప్రణాళికలు, పెరుగుతున్న దిగుమతులు


వ్యవసాయరంగంలో పెరుగుతున్న సమస్యలు, రైతుకు లభించని గిట్టుబాటు ధరలు, కొరవడిన ప్రణాళికలు, పెరుగుతున్న దిగుమతులు 

(1)ప్రజలకు నిత్యావసరాల్ని సరైన ధరకు అందించి ఆహారభద్రత కల్పించలేని ఏ దేశమూ ఆర్థికాభివృద్ధి సాధించలేదు. 
(2)కొన్ని పంటల దిగుబడులలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం అయినా ప్రజలకు సరైన ధరకు ఆహార పదార్థాలు అందడం లేదు, మరియు పూర్తిస్థాయిలోఎగుమతులు చేయడం లేదు. 
(3)ఆహారోత్పత్తుల ధరలను స్థిరీకరించాలంటే శుద్ధి, నిల్వసదుపాయాలు అత్యంత ఆవశ్యకం. ఇవి పూర్తిగా అందుబాటులోలేని దేశాల్లోనే ధరలు పెరుగుతాయి.
(4)వ్యవసాయ ఆహార ఉత్పత్తులు పెంచడానికి 2018లో 8 రకాల పంటలకు ఎగుమతి ప్రోత్సాహక వేదికను కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. 
ఉల్లి,ద్రాక్ష,అరటి,బియ్యం,మామిడి,తృణధాన్యాలు, దానిమ్మ,పువ్వులు వీటికి ఎగుమతి ప్రోత్సాహక వేదికను ఏర్పాటు చేశారు.
(5)2020 సెప్టెంబర్ లో ఆమోదించిన నిత్యావసర సరుకుల చట్టం సవరణని పక్కనపెట్టి ప్రస్తుతం ఉల్లి పంట విషయంలో మళ్ళీ ఆంక్షలు విధించారు. 
(6)2019లో ఉల్లి ధర 200 కు చేరడంతో,ఉల్లి ఎగుమతిపై కేంద్రం ఆంక్షలుకేంద్రం విధించింది.. గత సంవత్సరం పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని  కేంద్రం 1లక్ష టన్నులు స్టోర్ చేస్తే అందులో 25,000 టన్నులు కుళ్లిపోయిన పరిస్థితి.. దీనికి కారణం భారతదేశంలో శుద్ధి సదుపాయాలు లేకపోవడం..
(7)2020 మొదటి త్రైమాసికంలో భారత్ లో 6.8లక్షల టన్నులు ఉల్లి ఎగుమతి చేసింది, కానీ ప్రస్తుతం మళ్లీ దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉంది..దేశంలో కురిసిన అధిక వర్షాల కారణంగా పంట నష్టాల వల్ల సెప్టెంబర్ లో ఎగుమతులపై నిషేధం విధించారు.ప్రస్తుతం మళ్ళీ ధరలు కిలోకి 100 రూపాయలకి పెరిగాయి, ఈ క్రమంలో ఆఫ్ఘానిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 
(8)గత సంవత్సరం దేశంలో 2.44కోట్ల టన్నుల దిగుబడి అయినా ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయి, కారణం మనం నిల్వ చేసుకోలేకపోవడం..
(9)ప్రభుత్వ వ్యవసాయశాఖ అంచనా ప్రకారం క్వింటాల్ వరి  ధాన్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు 2529 రూపాయలు/క్వింటాల్  కానీ కనీస మద్దతు ధర నిర్ణయించే CACP వారి ప్రకారం మద్దతు ధర 1888 రూపాయలు/క్వింటాల్
(10)ప్రత్తి సమగ్ర ఉత్పత్తి వ్యయం 9469/క్వింటాల్
CACP వారి ప్రకారం మద్దతు ధర  5825/క్వింటాల్
(11) ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY, వాతావరణ ఆధారిత పంటల భీమా అమలు జరగడం లేదు.
(12) బీమా సదుపాయం లేక పోవడం వల్ల రైతు కు నష్టం పెరుగుతోంది 
(13)2019-20 తో పోల్చితే sunflower oil దిగుమతి ధర టన్నుకు 55000 నుంచి 75000 కి పెరిగింది. 
(14)వంట నూనెల దిగుమతులకు ప్రతి సంవత్సరం మనం వెచ్చిస్తున్న మొత్తం 70000 కోట్లు..
(15)2019 నవంబర్ - 2020 సెప్టెంబర్  కి 31.06 లక్ష టన్నుల సొయా నూనె, 23.48లక్ష టన్నుల sunflower ఆయిల్ దిగుమతులు మనం చేసుకున్నాము..

 ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే..

(a)ప్రాంతాల వారీగా క్లస్టర్స్ ఏర్పాటు చేయాలి 
(b)రైతులకు మద్దతు ధరలను ప్రోత్సహించాలి
(c)పంట నష్టాలకు భీమా కల్పించేలా చర్యలు 
(d)మార్కెట్ సదుపాయాలు పెంచాలి 

No comments:

Post a Comment

Eenadu Editorial Analysis (21/11/20)..GST - వస్తు సేవల పన్ను.. దేశంలో పన్నుల వ్యవస్థను సరళతరం చేసిన GST - ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలు..

Eenadu Editorial Analysis (21/11/20).. GST - వస్తు సేవల పన్ను.. దేశంలో పన్నుల వ్యవస్థను సరళతరం చేసిన GST - ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలు...