Wages Code, కార్మిక చట్టాల సవరణ - వేతన కోడ్ -2019
(1)2019 ఆగస్ట్ 8 న వేతనాలకు సంబంధించిన చట్టాలు,బోనస్ చట్టాలను కలిపి వేతనాల కోడ్ -2019
(2) ఈ వేతనాలు కోడ్ /wages code చట్టం లో ఇప్పటివరకు ఉన్న
వేతన చెల్లింపుల చట్టం -1936,
కనీస వేతనాల చట్టం -1948,
బోనస్ చెల్లింపుల చట్టం-1965,
సమాన వేతన చట్టం -1976 వంటి చట్టాలను ఇందులో కలిపారు
(3)కార్మిక సంఘాలు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎన్నో హక్కులని ఈ యొక్క కోడ్ తొలగించి వేసిందని కార్మిక సంఘాలు మరియు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
4) కార్మిక సంఘాల అభ్యంతరాలను పట్టించుకోకుండా పారిశ్రామికవేత్తల డిమాండ్కు అనుకూలంగా ఈ వేతన కోడ్ లో మార్పులు చేశారని కార్మిక సంఘాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి
5) భారతదేశంలో వేతనాలపై ఆధారపడ్డ 45.5 కోట్ల కార్మికులు దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది అని నిపుణుల అంచనా
6) NSSO సర్వే ప్రకారం భారతదేశంలో వేతనం పై ఆధార పడ్డ వారిలో 72 శాతం మంది వేతనం 18000 కంటే తక్కువ. ఇందులో 45 శాతం మంది యొక్క వేతనం 10,000 కంటే తక్కువ
7) భారతదేశంలో 1980వ సంవత్సరంలో ఉత్పత్తిలో కార్మికుల యొక్క వాటా 28.5 శాతంగా ఉంది. ఇదే సంఖ్య 2018 కి 10.9 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో అనగా 1980 నుంచి 2018 మధ్యలో యజమానుల యొక్క లాభాలు 45.2 శాతం పెరిగాయి.
ఈ వేతన కోడ్ లోని ముఖ్యమైన అంశాలు
1. కనీస వేతనాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని మార్పు చేశారు.. ఇంతవరకు ఇది కనీస ధరలకు అనుగుణంగా నిర్ణయించబడే ది..
2. కనీస వేతనాలను గంటల/ రోజులు/ నెలల వారిగా నిర్ణయించి అమలు పరిచే విధానాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత తొలగిపోతుంది అని మరియు PF, ESI, బోనస్ వంటి benefits కార్మికులకు దూరమవుతాయని కార్మిక సంఘాల యొక్క ప్రధానమైన ఆరోపణ
3) ఇంతకు ముందు ఉన్న చట్టాల ప్రకారం గా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగాలి కానీ అది కూడా ఇప్పుడు అమలు కావడం లేదు..
4) wages code కి సంబంధించి పార్లమెంటులో చర్చ జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్లో నియమించిన expert కమిటీ దేశంలో unskilled worker యొక్క కనీస వేతనం 8862 రూపాయల నుండి 11622 రూపాయల మధ్య ఉండాలని సూచించింది కానీ ప్రభుత్వం చట్టంలో National floor level wage ని 178 రూ/day గా నిర్ణయించింది..
5)19th indian labour conference ప్రకారంగా భారతీయ శ్రామికుడు పని చేయాలంటే 2700 కేలరీల శక్తినిచ్చే ఆహారం, ఏడాదికి కుటుంబానికి 72 గజాల బట్ట అవసరం అని, వేతనం లో 20%విద్యుత్, ఇంధన ఖర్చు గా ఉండాలని, పారిశ్రామిక హౌసింగ్ స్కీం ప్రకారం ఇంటి అద్దె ఉండాలని చెప్పింది
6) దీని ప్రకారం గా ప్రస్తుతం 25 వేల రూపాయల కనీస వేతనం ఉండాలి కానీ ప్రస్తుతం ప్రభుత్వం నూతన చట్టంలో ఈ అంశాన్ని అమలు పరచలేదు
7) 7 వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 18 వేల రూపాయల కనీస వేతనం కూడా కార్మికులకు లభించలేదు
8) కనీస వేతనాలు అమలు తీరుపై పర్యవేక్షణ వ్యవస్థను తనిఖీల వ్యవస్థను మార్పు చేసి దానిని inspector cum felicitator గా మార్చారు..
9) ఇంతవరకూ సాధారణ పరిస్థితులు ప్రమాదకర పరిస్థితులు అనే కేటగిరి ఉండేది ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసేవారికి ఎక్కువ వేతనం లభించేది
నూతన చట్టం ప్రకారం సాధారణ పరిస్థితులు ప్రమాదకర పరిస్థితులు రెండింటినీ ఒకే కేటగిరీకి మార్చారు. దీనివల్ల ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే కార్మికుని కి ఎక్కువ వేతనం లభించే అవకాశం లేదు
9) 15 వేల రూపాయల కంటే ఎక్కువ వేతనం లభించే కార్మికుడిని supervisor గా మార్పు చేశారు తద్వారా supervisor గా ఉన్న వ్యక్తి కార్మికుల యొక్క benefits పొందలేడు..
10) ఈ నూతన చట్టం ప్రకారం గా కార్మికుల యొక్క వేతనాలు పనిగంటల మార్పు తనిఖీల వ్యవస్థను నిర్వహించడం పట్ల International Labour Organization తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం జరిగింది
మొత్తం మీద ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్మిక చట్టాలు కార్మికుల యొక్క హక్కులను పెద్ద మొత్తంలో ఉల్లంఘిస్తున్నారని నవంబర్ 26వ తారీఖున దేశం మొత్తంలో కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడం జరిగింది తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాటానికైనా సిద్ధమని చెప్పి కార్మికులు ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా ఉన్న కార్మికుల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతగానో ఉంది కాబట్టి ఈ కార్మిక చట్టాల్లో అవసరమైన మేరకు మార్పులు చేయాల్సి ఉందని నిపుణుల యొక్క అభిప్రాయం.
No comments:
Post a Comment