Foreign Contributions Regulating Act (FCRA) చట్టానికి సవరణలు.. స్వచ్ఛంద సంస్థల నిధుల నియంత్రణకు FCRA చట్టానికి సవరణలు..
1.లాభాపేక్ష లేకుండా అవసరంలో ఉన్నవారికి సహాయం అందించేవే స్వచ్ఛంద సంస్థలు.
2.స్వచ్ఛంద సంస్థల నుండి నిజాయితీ జవాబుదారితనాన్ని ప్రభుత్వం ఆశిస్తోంది.
3.భారతదేశంలో FCRA చట్టాన్ని 1976లో చేశారు,దీనికి 2010 సంవత్సరంలో సవరణ చేశారు,మళ్లీ 2020 సంవత్సరంలో రెండవ సారి సవరణ చేశారు.
4.ఈ చట్టాన్ని రూపొందించడం లో ముఖ్య ఉద్దేశం ఏమనగా రాజకీయ పార్టీలకు విదేశీ నిధుల నియంత్రణ మరియు విదేశీ ప్రభుత్వాలు మనదేశంలో పెత్తనం చెలాయించడం నిరోధించాలి.
5.2010 సంవత్సరంలో చేసిన సవరణ ద్వారా పై అంశాలను పటిష్టంగా నిబంధనలు రూపొందించారు.వీటితో పాటు జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే అంశాలకు విదేశీ నిధులు వాడకూడదు అనే ముఖ్యమైన నిబంధనలు రూపొందించారు,మరియు విదేశీ నిధులు పొందాలనుకునే స్వచ్ఛంద సంస్థ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సంస్థ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాలి మరియు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సంస్థ కు వచ్చిన నిధుల వివరాలను నమోదు చేయాలి.
6. ఈ విధంగా నిబంధనలు రూపొందించిన తర్వాత విదేశీ విరాళాలు స్వచ్ఛంద సంస్థల ద్వారా దేశంలోకి రావడం పెరిగాయి,అయితే స్వచ్ఛంద సంస్థల పై నియంత్రణ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల 2020 సంవత్సరంలో సవరణ ద్వారా స్వచ్ఛంద సంస్థల నిధులను పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది.
2020 సవరణ ముఖ్యంశాలు :-
1. విదేశీ విరాళాలు పొందిన సంస్థ మాత్రమే వాటిని వినియోగించాలి ఇతర సంస్థలకు బదిలీ చేయకూడదు.
2. విదేశీ నిధుల లో పరిపాలనాపరమైన వ్యయాన్ని 20 శాతానికి నియంత్రించుకోవాలి.
3. ప్రతి స్వచ్ఛంద సంస్థ తప్పనిసరిగా ఢిల్లీలోని sbi లో ఖాతా తెరవాలి.
4. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారు విదేశీ విరాళాల పొందడానికి అనర్హులు.
5. ప్రతి స్వచ్ఛంద సంస్థ సంవత్సరానికి ఒకసారి తమ యొక్క రిజిస్ట్రేషన్ ను రెన్యూవల్ చేసుకోవాలి అంతేకకుండా రిజిస్ట్రేషన్ Renewal చేసుకొనే సమయంలో బోర్డు సభ్యుల యొక్క ఆధార్,passport వంటి పత్రాలను ప్రభుత్వానికి సమర్పించాలి.ఒకవేళ సంస్థ వీటిలో ఏవి సమర్పించక పోయినా సంస్థ యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయబడదు.
2020 సంవత్సరం లో ఈ నిబంధనలు రూపొందించడానికి కారణాలు :-
1. ఈ రోజు భారతదేశం లో రిజిస్టర్ చేసుకున్న స్వచ్ఛంద సంస్థల్లో పదిశాతం కూడా audit report ను చేయట్లేదు.దీని వల్ల పెద్ద మొత్తంలో అవకతవకలకు ఆస్కారం పెరుగుతోందని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిబంధనలను రూపొందించింది.
2. 2014 intelligence bureau నివేదిక ప్రకారంగా దేశంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు గా ఉన్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, గ్రీన్ పీస్ సంస్థలు పెద్ద మొత్తంలో నిధులు లో అవకతవకలకు పాల్పడ్డారని మరియు అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చాయని ఆరోపణ వచ్చింది. అంతేకాకుండా ఈ సంస్థలు చేపట్టిన ఈ చర్యల వల్ల దేశ జి.డి.పి 2 నుంచి 3 శాతం తగ్గింది అని IB Report తెలిపింది.
3. దేశంలో ఈ రోజు 32 లక్షల పైచిలుకు స్వచ్ఛంద సంస్థలు ఉన్నప్పటికీ ఇందులో చాలా సంస్థలు రెండు లేదా మూడు FCRA Numbers కలిగి ఉన్నాయని,దీనివల్ల అవకతవకలకు ఆస్కారం పెరుగుతుంది అని ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఆలోచన.
ఇవన్నీ అంశాలకు పరిష్కారమే ప్రస్తుతం FCRA చట్టానికి చేసిన సవరణలు..
Tq anna
ReplyDelete