ఈరోజు భారతదేశంలో 6.62 లక్షల గ్రామాలు ఉన్నాయి. 2011 సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారంగా భారతదేశంలో 17.9 కోట్ల గృహాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయని అంచనా. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ గృహాలకు యజమానుల దగ్గర ధ్రువీకరణ పత్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ఈ క్రమంలో వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు వారి సమస్యలు తొలగించాలి మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆస్తుల రికార్డును పూర్తిస్థాయిలో ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి స్వమిత్వ యోజన అనే పథకాన్ని తీసుకు రావడం జరిగింది.
ప్రధానమంత్రి స్వమిత్వ యోజన యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతంలో ప్రజలకూ సమగ్ర ఆస్తి ధ్రువీకరణ పత్రాలు అందించాలి.
2020 సంవత్సరం ఏప్రిల్ 24వ తారీఖున పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఆరు రాష్ట్రాల్లో 763 గ్రామాల్లో ఈ పథకం కింద సర్వే పూర్తి చేసి 1.32 లక్షల మందికి ధ్రువీకరణ పత్రాలు తయారు చేశారు.
పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకం విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో 2020 సంవత్సరం అక్టోబర్ 11 వ తారీకున నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించారు.
రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో దేశంలో అన్ని అన్ని గ్రామాలలో న ఆస్తులను పూర్తిస్థాయిలో సర్వే చేసి రికార్డు చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉంది 2020-21 సంవత్సరం లో 15.3%
2021-22 సంవత్సరంలో 37.4%
2022-23 సంవత్సరంలో 29.6%
2023-24 వ సంవత్సరంలో 17.8%
పనులు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది
ప్రధానమంత్రి స్వమిత్వ యోజన కింద గుర్తింపుకార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ గుర్తింపు కార్డు కు ఒక యునిక్ ఐడి అనేది ఉంటుంది దీని ద్వారా ఆస్తుల వివరాలు పూర్తి స్పష్టత పూర్తి స్పష్టత తో అందుబాటులో ఉంటాయి.
ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. కేంద్రంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. రాష్ట్రాలలో రెవెన్యూ శాఖ మరియు ల్యాండ్ రికార్డ్స్ శాఖలు నోడల్ ఏజెన్సీ గా పనిచేస్తాయి. సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ పథకం అమలులో సాంకేతిక భాగస్వామిగా ఉండబోతున్నారు.
డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి వ్యక్తిగత ఆస్తుల సరిహద్దులు, గ్రామపంచాయతీ పరిధిలో చెరువులు, రోడ్లు, కాలువలు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలు పరిగణలోకి తీసుకొని భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా సరిహద్దుల రూపొందిస్తారు.
ప్రధానమంత్రి స్వమిత్వ యోజన ఉపయోగాలు
1. ప్రజల వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటు ప్రభుత్వ ఆస్తుల వివరాలు కూడా నమోదు చేయబడతాయి.
2. గ్రామీణ ప్రజల ప్రాపర్టీని ఆర్థిక సంపదగా గుర్తించారు దీంతో బ్యాంకులో రుణాలు పొందడం సులభతరమౌతుంది.
3. ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుంది తద్వారా గ్రామ పంచాయతీల నిధుల లేమి సమస్య తొలగిపోతుంది
4. దేశంలో మొత్తం ప్రజల ఆస్తి పై స్పష్టత అనేది పెరుగుతుంది. పారదర్శకత పెరుగుతుంది తద్వారా దేశ ప్రజల ఆస్తులపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన కలుగుతుంది
No comments:
Post a Comment