Sunday, 22 November 2020

Eenadu Editorial Analysis (21/11/20)..GST - వస్తు సేవల పన్ను.. దేశంలో పన్నుల వ్యవస్థను సరళతరం చేసిన GST - ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలు..

Eenadu Editorial Analysis (21/11/20)..

GST - వస్తు సేవల పన్ను..
దేశంలో పన్నుల వ్యవస్థను సరళతరం చేసిన GST - ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలు..


 2017 సంవత్సరం జూలై నెలలో భారతదేశం లో జీఎస్టీ అమల్లోకి రావడం జరిగింది.

 122 వ రాజ్యాంగ సవరణ బిల్లు మరియు 101 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో జీఎస్టీ అమల్లోకి రావడం జరిగింది. 

 ఒకే దేశం ఒకే పన్ను విధానం అనే ప్రాతిపదికన జీఎస్టీ అమల్లోకి రావడం జరిగింది.

GST ద్వారా దేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థ కు దిశానిర్దేశం చేయడం జరిగింది.

 జీఎస్టీ ద్వారా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు  సాధ్యమైంది 

పన్ను చెల్లింపు పద్ధతులు, వ్యాపార నిర్వహణ మరియు రిటర్నుల సమర్పణ సులభతరం అయ్యాయి. 

 2017 2020 మధ్య ప్రభుత్వం సంబంధించి వచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకొని విధి విధానాలను తరలిస్తూ పన్ను రేట్లలో హేతుబద్దీకరణ ఈ క్రమంలో భారత దేశంలో పన్ను ఎగవేత ల నిర్మూలనకు ఇది ఎంతగానో దోహదపడింది. 

 ప్రస్తుతం జిఎస్టి కి సంబంధించి రెండు ప్రధానమైన వాదనలు ఉన్నాయి 

1.GST అద్భుత విజయం సాధించిందని

2.GST విధానపరమైన వైఫల్యం అని. 

 వాదనలు ఏమైనప్పటికీ ప్రస్తుతం భారతదేశం సులభతరం వ్యాపార నిర్వహణ సూచి లో 2020 సంవత్సరానికి 63 వ స్థానం సంపాదించింది. 

 2016 సంవత్సరంలో ఈ యొక్క సూచీలో భారత్ స్థానం 130.

 అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఒక దేశంలో పెట్టుబడి పెట్టడానికి పరిగణలోకి తీసుకునే అతి ప్రధానమైన అంశం చికాకులు లేని పన్నుల వ్యవస్థ. 

 జిఎస్టి ద్వారా భారతదేశంలో చికాకులు లేని పన్నుల వ్యవస్థ సాధ్యమైంది ఈ క్రమంలోనే మన భారతదేశం సులభతర వ్యాపార నిర్వహణ సూచీలో వేగంగా ముందుకు వెళ్ళింది. 

 జిఎస్టి అమలులోనికి వచ్చిన తర్వాత భారత దేశంలో పన్నుల వ్యవస్థ లోకి వచ్చిన వారి సంఖ్య వేగంగా పెరిగింది 2017 లో ఈ సంఖ్య 38 లక్షలు కాగా 2020 లో ఈ సంఖ్య 1.23 కోట్లు

 జిఎస్టి ని మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఎలక్ట్రానిక్  వే బిల్స్ మరియు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 

 జీఎస్టీ అమలు లోనికి వచ్చిన తర్వాత ఒక సంస్థ చేస్తున్న వ్యాపారాలపై పూర్తిగా  తెలుసుకోవడం సులభమైంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థల పై అవగాహన పెరగడం వల్ల రుణాల లభ్యత మెరుగైంది. సులభంగా రుణాలు లభిస్తున్నాయి. 

 జీఎస్టీ ఇంతవరకూ భారతదేశంలో పన్ను వ్యవస్థలో ఎన్నో అంశాలలో సరళత్వం తీసుకొచ్చింది అయితే ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలు 

1. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించడం. 

 జిఎస్టి చట్టం అమలులోనికి వచ్చినపుడు రాష్ట్రాలు జీఎస్టీ ని వ్యతిరేకించాయి. కారణం రాష్ట్రాల యొక్క ఆదాయం పెద్ద మొత్తంలో తగ్గడం. దీనికి ప్రతిగా కేంద్రం రాష్ట్రాలకు 5 సంవత్సరాలపాటు లోటును భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. 

 కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లోటు భర్తీ చేయడానికి కేంద్రం దగ్గర డబ్బు అందుబాటులో లేదు ఈ క్రమంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలు పెరుగుతున్నాయి. 2022 తర్వాత కేంద్రం ఈ లోటును భర్తీ చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం చాలా తగ్గిపోయే అవకాశం ఉంది. 

 ఈ క్రమంలో ఈ అంశంపై మరొకసారి దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

2. మారుతూ ఉండే జీఎస్టీ నిబంధనలకు వ్యక్తిగత సంస్థలు చిన్న తరహా సంస్థలు కట్టుబడి ఉండేలా చేయడం అనేది రెండవ సమస్య. 

 ఈ చిన్న తరహా సంస్థలు, వ్యక్తిగత సంస్థలో వాటికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే యంత్రాంగాన్ని రూపొందించాలి. 

GSTR1, GSTR3B, ITC,  E-waybill, E-invoice వంటి విధానాలు అమలులో ఉన్న క్రమంలో వాటిపై అవగాహన లేకపోతే వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉండదు ఈ క్రమంలో ప్రభుత్వమే ఈ అంశాలపై వ్యాపారులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. 

 3) క్లెయిమ్ రిఫండ్ కి సంబంధించిన అంశం. 

 క్లెయిమ్ రిఫండ్ కి సంబంధించి ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలి. ప్రస్తుతం ఈ రిఫండ్ కొరకు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వేగవంతంగా రిఫండ్ అందర వల్ల సంస్థలు అనవసర రుణాలు తీసుకోవాల్సిన అవసరం నుంచి బయటపడతాయని తద్వారా సంస్థల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. 

4) నకిలీ ఇన్వాయిస్ ల సమస్య నాలుగవ సమస్య

 ప్రస్తుతం ఈ నకిలీ ఇన్వాయిస్ ల సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అనే విధానాన్ని తీసుకు వచ్చింది కానీ ఇవి పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. 

 ఈ క్రమంలో ప్రభుత్వం ఈ సమస్యలన్నీ వేగవంతంగా పరిష్కరించినట్లు అయితే భారత దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ విధానం ఎంతగానో తోడ్పడుతుంది

Saturday, 21 November 2020

COVID Reinfection.. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారికి మళ్లీ వ్యాధి సంక్రమిస్తుందా??

Eenadu Editorial Analysis (20/11/20)..

COVID Reinfection

కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారికి మళ్లీ వ్యాధి సంక్రమిస్తుందా?? 

 కరోనా వైరస్ మానవుని శరీరంలోకి ప్రవేశించి శరీరంలోని కణజాలాన్ని ఉపయోగించుకొని తన సంఖ్యను పెద్ద మొత్తంలో వృద్ధి చేసుకొని శరీరం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. 

 నిపుణుల అభిప్రాయం ప్రకారం మానవుని శరీరం పుట్టుకతోనే పెద్ద మొత్తంలో రక్షక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటుంది.  ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన వైరస్ కి మానవుని శరీరంలోని రక్షణ వ్యవస్థ ప్రతిరక్షక కణాలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. వీటినే యాంటీబాడీస్ అంటారు. 

 ఒకసారి ఉత్పత్తి చేయబడిన ఈ ప్రతిరక్షకాలు మానవునికి జీవితకాలం నిరోధకతను సంపాదించి పెడతాయి. 

 ఈ వ్యాధిబారిన పడినవారికి ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేయబడి ఉంటాయి కానీ వ్యాధి బారిన పడని వారికి శరీరంలో ప్రతిరక్షకాల ఉత్పత్తి కావడం కొరకు వ్యాక్సిన్ను ఇస్తారు. ఈ వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి నిర్వీర్యం చేయబడిన వైరస్ చొప్పించబడుతుంది. శరీరంలోని రక్షణ వ్యవస్థ ఈ నిర్వీర్యం చేయబడిన వైరస్కు ప్రతి రక్షక కణాలను ఉత్పత్తి చేసి శరీరాన్ని ఎప్పుడూ పోరాటానికి సిద్ధం గా ఉంచుతుంది. శరీరంలో ఉండే t cells శరీరంలో ప్రతిరక్షక వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి ఉపయోగపడతాయి. 

 సాధారణ మానవుని లో శరీరంలోకి ప్రవేశించిన వైరస్కు ప్రతిరక్షకాలు నాలుగు నుంచి ఆరు రోజుల్లో తయారవుతాయి. ఇవి తాత్కాలికంగా వైరస్ను నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడతాయి అదే విధంగా మానవ శరీరం దీర్ఘకాలంలో వైరస్ బారినుండి కాపాడుకోవడానికి రెండు నుంచి మూడు వారాల్లో దీర్ఘకాల ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ దీర్ఘకాల ప్రతిరక్షకాలు మానవునికి జీవితాంతం నిరోధకతను సంపాదించి పెడతాయి. 

 కొంతమందిలో వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత 90 రోజులకు మళ్లీ వైరస్ బారిన పడటం గమనించారు. దీనినే రీ ఇన్ఫెక్షన్ అంటున్నారు. 

 కొంత మందిలో వారి శరీర నిర్మాణం,  వారు తీసుకునే పోషక స్థాయి, మొదటిసారిగా వైరస్ బారిన పడిన ప్రభావం, ఇవన్నీ కారణాల వల్ల వారి శరీరం దీర్ఘకాల ప్రతి రక్షక కణాలను ఉత్పత్తి చేసుకో లేకపోవడమే రెండవసారి వైరస్ బారిన పడడానికి కారణం అని నిపుణుల అంచనా. 

 అదేవిధంగా రెండవ సారి వైరస్ బారిన పడడానికి రెండవ కారణం వైరస్ జన్యురూపం మార్చుకోవడం. వైరస్ జనాలు రూపాన్ని మార్చుకోవడం వల్ల శరీరంలో ఉండే రక్షక వ్యవస్థ నూతనంగా వచ్చిన వైరస్ ని గుర్తించకపోవడం వల్ల అప్పటికే ఉత్పత్తి అయిన ప్రతిరక్షకాలు ఆ వైరస్ ని ఏమీ చేయలేక పోవడం వల్ల శరీరంపై వైరస్ ప్రభావం చూపిస్తుంది. 

 అయితే శాస్త్రీయంగా కరోనా వైరస్ జన్యురూపం మార్చుకుంటుంది అనడానికి ఆధారాలు పూర్తి స్థాయిలో లేవు. 

 నిపుణుల అంచనా ప్రకారం ఒకవేళ వైరస్ జన్యురూపం మార్చుకుంటే ఇప్పుడు ఉత్పత్తి చేయబడుతున్న వ్యాక్సిన్ ప్రభావం చూపదు అంటున్నారు కారణం ఏమనగా వ్యాక్సిన్ ద్వారా ఉత్పత్తి అయిన ప్రతి రక్షకాలు జన్యురూపం మార్చబడిన వైరస్ను ఏమీ చేయలేవు. 

Friday, 20 November 2020

Demonetisation in INDIA..పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థ కు లాభం చేకూర్చిందా?? నష్టం చేకూర్చిందా?? ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చిందా?? వాస్తవాలు..

Demonetisation in INDIA..

పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థ కు లాభం చేకూర్చిందా?? నష్టం చేకూర్చిందా?? ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చిందా??  వాస్తవాలు..

-->> చలామణిలో ఉన్న నోట్లను ఆ దేశానికి చెందిన కేంద్ర బ్యాంకు/ సెంట్రల్ బ్యాంక్ రద్దు చేయడాన్ని లేదా చలామణిలో లేకుండా చేయడంను నోట్ల రద్దు లేదా డిమానిటైజేషన్ అంటారు.

2016 నవంబర్ 8 వ తారీఖున భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు దేశంలో పెద్ద నోట్లు 500 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు

 స్వాతంత్రం తరువాత భారతదేశంలో మొదటిసారిగా 1978 సంవత్సరంలో మొరార్జీదేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పెద్ద నోట్ల రద్దు చేయబడింది అప్పటికి చలామణిలో ఉన్న 500 రూపాయలు 1000 రూపాయలు 10000 రూపాయల నోట్ల రద్దు చేశారు. 

 2016 నవంబర్ 8 న భారతదేశంలో రెండవసారి పెద్ద నోట్ల రద్దు చేయబడింది.

 2016 లో నోట్ల రద్దు జరిగినప్పుడు భారత దేశ జీడీపీలో చలామణిలో ఉన్న నగదును విలువ 12 శాతానికి సమానం అని మరియు భారతదేశంలో మొత్తం నగదు విలువ లో రద్దు చేయబడిన నోట్ల నగదు విలువ దాదాపు 85 శాతానికి సమానమని మరియు మొత్తం రద్దు చేయబడిన నోట్ల సంఖ్య అప్పటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్ల సంఖ్యలో 24.4 శాతానికి సమాన అని నివేదికలు తెలుపుతున్నాయి.

 2016లో నోట్ల రద్దు ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు.

1. నల్లధనాన్ని పెద్ద మొత్తంలో అరికట్టడం.

2. అక్రమంగా చలామణిలో ఉన్న దొంగనోట్లను అరికట్టడం.

3. ఉగ్ర నిధులను పెద్ద మొత్తంలో అరికట్టడం.

4. ప్రజల ద్వారా బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతాయని ఆ డిపాజిట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని ప్రభుత్వం ఆశించింది.

5. ప్రజల అక్రమ సంపాదన లపై ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఆశించింది.

6. డిజిటల్ లావాదేవీలు పెద్ద మొత్తంలో పెరుగుతాయని తద్వారా దేశంలో అక్రమ సంపాదన ఉండబోదని ప్రభుత్వం ఆశించింది.


 వాస్తవాలు..

1. నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ఆశించిన విధంగా కాకుండా 99.3 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ రంగంలోకి చేరాయి..  దీనిని బట్టి చూస్తే నల్లధనాన్ని నిర్మూలించాలి అనే అంశం పూర్తిస్థాయిలో నెరవేరలేదు.. కారణమేమనగా దేశంలో నల్లధనం బంగారం రూపంలో రియల్ఎస్టేట్ రూపంలో ఉండడం.

 2. బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్లు పెరిగి ఆ డిపాజిట్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులు గా మారి దేశంలో పరిశ్రమలు స్థాపించబడి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశించింది కానీ వాస్తవంగా దేశంలో పెద్ద మొత్తంలో ఉపాధి కల్పిస్తున్న రంగాలైన వ్యవసాయం మరియు అసంఘటిత రంగం రెండు రంగాలు కుదేలు అయిపోయాయి. ఈ క్రమంలో 85 శాతం ఉపాధి కల్పిస్తున్న ఈ రెండు రంగాలలో పెద్దమొత్తంలో నిరుద్యోగిత నమోదైంది. ఆ ప్రభావమే ప్రస్తుత ఆర్థిక మందగమనం.

3. నగదు లావాదేవీలు తగ్గించాలి డిజిటల్ లావాదేవీలు పెంచాలని ప్రభుత్వ లక్ష్యం కాగా ప్రస్తుతం పెద్ద మొత్తంలో నిరుద్యోగిత కారణంగా ప్రజల ఆదాయాలు తగ్గి అన్నిరకాల లావాదేవీలు తగ్గిపోయాయి. ప్రజలకు ఖర్చు చేసే శక్తి కూడా తగ్గిపోయింది.

4. చలామణిలో ఉన్న నగదు కు మరియు gdp కి ratio 2019-20 లో 11.3%కాగా 2020-21 లో 12%.. ఇది 2016లో నోట్ల రద్దు సమయంలో ఉన్న శాతానికి సమానం అనగా భారత దేశంలో చలామణిలో ఉన్న నగదు ఏ మాత్రం తగ్గలేదని ఇది తెలుపుతుంది.

5. చలామణి నగదు లో ఉన్న పెరుగుదల వేగం growth rate 2019 లో 16.8% కాగా 2020లో  14.5% అనగా దేశంలో చలామణిలో ఉన్న నగదు పెద్దమొత్తంలో పెరుగుతోంది.

6. దొంగనోట్లను అరికట్టాలి ఉగ్ర నిధులను అరికట్టాలి అన ప్రభుత్వ లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరలేదు అని నివేదికలు తెలుపుతున్నాయి. 

Thursday, 19 November 2020

RCEP - Regional Comprehensive Economic Partnership..ప్రాంతీయ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం..

RCEP - Regional Comprehensive        Economic Partnership..ప్రాంతీయ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం.. 


1. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15 సభ్యదేశాలు కుదుర్చుకున్న ఒప్పందం RCEP లేదా ప్రాంతీయ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం. నవంబర్15వ తారీఖున ఈ 15 దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి.
2. ప్రధానంగా ఈ దేశాల మధ్య ఆర్థిక పరమైన సహకారం పెంపొందించడానికి ఎగుమతులు దిగుమతులు సులభంగా జరగడానికి ఉద్దేశించినదే ఈ ఒప్పందం.
3. ఈ ఒప్పందంలో ప్రస్తుతమున్న 15 సభ్యదేశాలు:
10ASEAN దేశాలు అనగా థాయిలాండ్,  వియత్నాం, కంబోడియా, లావోస్,  ఇండోనేషియా ఫిలిప్పైన్స్, మలేషియా,  బర్మా, బ్రూనై, సింగపూర్.
(TV CLIP of MBBS)+ చైనా, జపాన్,  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,  సౌత్ కొరియా.
4. ఈ ఒప్పందానికి సంబంధించిన భావన 2012 సంవత్సరంలోనే ప్రారంభమైంది చైనా దేశం ఈ భావనను ప్రారంభించింది ఇదే సమయంలో అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న obama గారు  ట్రాన్స్ పసిఫిక్ పార్టిసిపేషన్ అనే కూటమిని తీసుకొచ్చారు. 
5. 2016 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ గారు TPP అమెరికా యొక్క ప్రాధాన్యతను విస్మరిస్తోందని TPP నుంచి బయటికి రావడం జరిగింది. 
6. డోనాల్డ్ ట్రంప్రు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా అమెరికా మధ్య విభేదాలు పెద్దమొత్తంలో పెరిగాయి అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం,  అమెరికా చైనాల మధ్య సుంకాలు ప్రతి సుంకాలు  వంటి వివిధ చర్యలతో పాటుగా ఇటీవల వచ్చిన కరోనా వైరస్ వ్యాప్తికి చైనా దేశం పరోక్షంగా కారణమని అమెరికా వ్యాఖ్యానించడం ఇవన్నీ కారణాలవల్ల చైనా అమెరికాల మధ్య విభేదాలు పెద్దమొత్తంలో పెరిగాయి
 7.ఈ క్రమంలోనే అమెరికా చైనా నుంచి తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం అమెరికా యొక్క కంపెనీలు తమ ఉత్పత్తులను నిలిపివేయాలని ఆదేశించడం అదే సమయంలో అమెరికా మిత్ర దేశాలు చైనా నుంచి పెట్టుబడుల ఉపసంహరణ డానికి ప్రయత్నించడం ఇవన్నీ కారణాలవల్ల చైనా దేశం తన ప్రాధాన్యతను కాపాడుకోవడానికి ఈ RCEP కూటమిని వేగంగా ముందుకు నడిపింది. 
8. కూటమిలో ఉన్న ప్రస్తుత సభ్య దేశాలను బట్టి చూస్తే మొత్తం ప్రపంచంలోని మూడోవంతు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మరియు ప్రపంచ జీడీపీలో 30 శాతం విదేశాల నుంచి వస్తోంది అదేవిధంగా ప్రపంచ వాణిజ్యంలో 29 శాతం మరియు పెట్టుబడులలో 32శాతం ఈ దేశాల నుంచి రావడం జరుగుతోంది. 
9. ఈ క్రమంలో ఈ కూటమి ఏర్పాటు వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 18600 కోట్ల డాలర్లు లాభం చేకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు

 కూటమి యొక్క ముఖ్య ఉద్దేశాలు:
1. సభ్య దేశాల మధ్య సుంకాలను తగ్గించడం
2. అంతర్జాతీయ సరఫరా గొలుసు లో కూటమి దేశాలు ప్రధాన భాగస్వామిగా ఉండాలనే ఆలోచన. 
3. కూటమిలోని దేశాలు ఇతర సభ్య దేశాల్లో పెట్టుబడులకు అవకాశం. 
4. భాగస్వామి దేశాల్లో ఎగుమతి దిగుమతులకు అడ్డంకులు తొలగింపు. 
5. కూటమి సభ్య దేశాల్లో పెద్ద మొత్తంలో పరిశ్రమల ఏర్పాటు ఉద్యోగ అవకాశాల పెంపు. 
6. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధికి అవకాశం కల్పించడం. 

 భారతదేశం కూటమిలో భాగస్వామ్యం కాకపోవడానికి కారణాలు. 
1. కూటమి సభ్య దేశాల నుంచి పెద్ద మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు దేశం లోకి రావడం తద్వారా దేశంలో వ్యవసాయ రంగం ఇబ్బందులకు గురవుతుందని భారతదేశం కూటమిలో చేరలేదు. 
2. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో పాల ఉత్పత్తులు దేశం లోకి రావడం తద్వారా దేశంలో పాడిపరిశ్మ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని భారత దేశం కూటమిలో చేరలేదు. 
3. కూటమి నిబంధనల ప్రకారం పెట్టుబడులపై ఆంక్షలు తొలగించడం వల్ల చైనా దేశం నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు భారత దేశం లోకి వచ్చి దేశీయంగా ఉన్న పరిశ్రమలు ఇబ్బందులు లోకి వెళ్లే అవకాశం ఉందని భారతదేశం కూటమిలో చేరలేదు. 
4. మేకిన్ ఇండియా స్ఫూర్తితో భారతదేశంలో ఏర్పాటైన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు చైనా నుంచి వచ్చే చౌకైన ఉత్పత్తుల వల్ల పెద్ద మొత్తంలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భారత దేశం కూటమిలో చేరలేదు. 
5. దేశ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ అంశాన్నైనా ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్లదని నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

 చైనా దేశం ఈ కూటమిని పెద్ద మొత్తంలో ముందుకు తీసుకువెళ్లడానికి కారణాలు. 
1. చైనా దేశం నుంచి తరలిపోతున్న కంపెనీలను కూటమి దేశాల్లో స్థాపించడం వల్ల నష్టాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన. 
2. కూటమిలోని ఇతర దేశాలతో ఆంక్షలు లేని వాణిజ్యం పెంచుకోవడం వల్ల తన కరెన్సీని కూటమిలోని ఇతర దేశాల్లో పెద్ద మొత్తంలో ఉపయోగించడం వల్ల అమెరికా డాలర్ కు ప్రత్యామ్నాయంగా తన కరెన్సీ అభివృద్ధి చేయాలనే ఆలోచన. 

 తన స్వప్రయోజనాల కొరకు చైనా చేస్తున్న ఈ ఆలోచనలో భారతదేశం భాగస్వామి కాకూడదనే ఉద్దేశంతోనే ఇండియా RCEP కూటమిలో చేరలేదు. 

Tuesday, 17 November 2020

DISCOMలకు పెరుగుతున్న సమస్యలు..ఉదాసీన ప్రభుత్వ విధానాలు-పెరుగుతున్న అప్పులు - Discom ల కష్టాలు..

DISCOMలకు పెరుగుతున్న సమస్యలు..ఉదాసీన ప్రభుత్వ విధానాలు-పెరుగుతున్న అప్పులు - Discom ల కష్టాలు..

 దేశంలో విద్యుత్ రంగానికి సంబంధించి మూడు రకాల సంస్థలు సేవలందిస్తున్నాయి
 1. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు genco
2.విద్యుత్ సరఫరా సంస్థలు transco
3.విద్యుత్ పంపిణీ సంస్థలు discom. 
 ప్రస్తుతం వివిధ సమస్యల కారణంగా డిస్కంలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాయి. 

 విద్యుత్ ఉత్పత్తి సంస్థలు (Genco లు )విద్యుత్ ను ఉత్పత్తి చేస్తే Transco సంస్థలు విద్యుత్ సరఫరా చేస్తాయి మరియు డిస్కంలు విద్యుత్ను పంపిణీ చేస్తాయి. 
 పంపిణీ చేయబడిన విద్యుత్ కి సంబంధించిన బిల్లులను వసూలు చేసే బాధ్యత డిస్కంలదే. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్త సబ్సిడీ విద్యుత్తు హామీలు ఉండటం వల్ల డిస్కమ్లకు పూర్తిస్థాయి బిల్లులు వసూలు కావడం లేదు. 
 ఈ క్రమంలోనే డిస్కంలు ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించడం లేదు దీని వల్ల ఉత్పత్తి సంస్థల పై భారం పెరుగుతోంది అదే సమయంలో డిస్కంలు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన మొత్తం బాకీ పడిపోయాయి. 
 ప్రస్తుతం ఈ అప్పుల విలువ ఒక లక్షా ఇరవై వేల కోట్లుగా ఉంది అనే అంచనా. 3 సంవత్సరాల క్రితం డిస్కంల యొక్క విలువ ఒక లక్ష కోట్లుగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉదయ్ (UDAY )అనే పథకం తీసుకురావడం ద్వారా డిస్కంలపై భారాన్ని తగ్గించింది. కానీ ప్రస్తుతం మళ్లీ దాదాపు లక్ష కోట్ల అప్పులు ఉన్న క్రమంలో డిస్కంల పునరుద్ధరణ గురించి కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆలోచిస్తోంది. 

2. భారతదేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 3లక్షల 71 వేల మెగావాట్లు గా ఉంటే మనం అందులో కేవలం 48 శాతం అనగా ఒక లక్షా 76 వేల మెగావాట్లు మాత్రమే వినియోగిస్తున్నారు అంతేకాకుండా కరోనా కాలంలో భారతదేశంలో విద్యుత్ వినియోగం 9.1 శాతం తగ్గిందని అంచనా. 

 విద్యుత్ వినియోగం తగ్గినట్లయితే ఉత్పత్తి సంస్థలకు మరియు పంపిణీ సంస్థలకు రెండిటికీ నష్టమే. ఈ క్రమంలోనే పంపిణీ సంస్థల యొక్క అప్పులు ఒక లక్ష కోట్లు దాటినట్లు గా అంచనా వేస్తున్నారు.
 2021 22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో విద్యుత్ ఛార్జీల పెంచనట్లయితే డిస్కంల మనుగడ కష్టం అని డిస్కంలు అంటున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం నవంబర్ చివరి కల్లా డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ నియంత్రణ మండలి తమ యొక్క విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను సమర్పించాలి కానీ విద్యుత్ చట్టం లో చెప్పబడిన ఈ అంశం ఇప్పటికీ పూర్తిస్థాయిలో నెరవేరటంలేదు..  గత సంవత్సరం దేశంలో 11 రాష్ట్రాలు ఈ ప్రతిపాదనలు సమర్పించలేదు.
 భారతదేశంలో భారత ఇంధన ఎక్స్చేంజ్ అనేది ఏర్పాటు చేయబడింది ప్రధానంగా రాష్ట్రాలలో ఉన్న మిగులు విద్యుత్ను కొనుగోలు చేసి మరియు విద్యుత్ అవసరం ఉన్న రాష్ట్రాలకు విద్యుత్ అమ్మడానికి ఈ ఎక్స్చేంజ్ పనిచేస్తుంది. 2008 సంవత్సరంలో ఒక యూనిట్కు సగటున ఉన్నా 7.29  rsమొత్తము 2020 సంవత్సరానికి 2.49rs తగ్గిపోయింది ప్రధాన కారణం డిమాండ్ తగ్గడం.
 

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం డిస్కమ్లకు భారత్ అభియాన్ కింద 90 వేల కోట్లు కేటాయించి ఉత్పత్తి సంస్థలకు చెల్లించే మొత్తాన్ని చెల్లించే విధంగా ఏర్పాటు చేసింది. అయితే ఈ మొత్తము అప్పుగా నే ఉన్నందువల్ల డిస్కంలపై ఇది కూడా భాగంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు

 ప్రస్తుతం భారతదేశంలో 15 రాష్ట్రాలలో కేవలం 80 శాతం మాత్రమే విద్యుత్ బిల్లులు ఇవ్వబడుతున్నాయి. ఇచ్చిన విద్యుత్ బిల్లులో కి సంబంధించిన మొత్తంలో ఏ రాష్ట్రం కూడా 100% వసూలు చేయడం లేదు. దీనివల్ల డిస్కంలపై తీవ్రమైన భారం పడుతోంది.

 ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం నూతనంగా ప్రీపెయిడ్ మీటర్లు, వ్యవసాయ విద్యుత్కు మీటర్లు అనే ప్రతిపాదన తీసుకు రావడం జరిగింది.

 దీనివల్ల ముందుగానే చెల్లించిన మొత్తానికే విద్యుత్తు వినియోగదారునికి అందించడం జరుగుతుంది. వ్యవసాయ విద్యుత్కు మీటర్లు బిగించడం వల్ల సరఫరాలో నష్టాలు పూర్తిస్థాయిలో అంచనాకు రావడానికి సాధ్యమవుతుంది.

 అయితే ఈ ప్రతిపాదనలపై కూడా కొన్ని విమర్శలు అనేవి ఉన్నాయి మరియు భారత దేశంలో ప్రస్తుతం discom లను  ప్రైవేట్ వారికి అప్పగించాలని నూతన విద్యుత్ చట్టం సవరణ లో చేర్చారు. దీనివల్ల డిస్కంలు లాభ పడతాయని ప్రభుత్వం ఆలోచన.

 నిపుణుల ప్రకారం గా ప్రతి సంవత్సరం డిస్కంలు జరపాల్సిన ఆడిటర్ తప్పకుండా జరిపినట్లయితే అవకతవకలకు ఆస్కారం ఉండదని డిస్కంలలో సమస్యలు ఉండవని నిపుణుల సూచన..

Monday, 16 November 2020

NEP - 2020 STARS Project..నూతన జాతీయ విద్యా విధానం-2020 అమలులో భాగంగా STARS Project..

NEP - 2020    STARS Project..

నూతన జాతీయ విద్యా విధానం-2020 అమలులో భాగంగా STARS Project..


1. భారతదేశంలో 1968వ సంవత్సరంలో మొదటి సారిగా కమిషన్ సిఫార్సుల మేరకు మొదటి జాతీయ విద్యా విధానం అమలులోకి రావడం జరిగింది కానీ ఆ సమయంలో విద్య రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం కారణంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు పూర్తి స్థాయిలో అమలు చేయబడలేదు. 

2 ఆ క్రమంలోనే ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో కి మార్పు చేసింది తద్వారా విద్య కి సంబంధించి కేంద్రం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడింది. 

3. ఆ తర్వాతి క్రమంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా 1986వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశంలో రెండవ జాతీయ విద్యా విధానం అమలులోకి రావడం జరిగింది. కానీ మన లక్ష్యం గా ఉన్నా 100% అక్షరాస్యత అనేది సాధ్యపడలేదు. 

4. ఈ క్రమంలోనే ప్రభుత్వం 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చింది 21A ప్రకరణ లో విద్యను ప్రాథమిక హక్కుగా చేరుస్తూ ఉచిత నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి అందించాలని నిబంధనలు రూపొందించారు. అంతేకాకుండా ఆదేశిక సూత్రాల్లో 45వ ప్రకరణాలో  0 నుంచి 6 సంవత్సరాల వయసు వారికి అందించడం ప్రభుత్వ బాధ్యతగా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రాథమిక విధుల్లో 51A k లో ఇదే విషయాన్ని చేర్చడం జరిగింది

5. అయినప్పటికీ మన లక్ష్యమైనా 100% అక్షరాస్యత ఇప్పటికీ నెరవేరలేదు ఈక్రమంలోనే ప్రభుత్వం కస్తూరి రంగన్ కమిటీ ని 2015లో ఏర్పాటు చేయడం కస్తూరి రంగన్ కమిటీ సిఫారసుల మేరకు భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 లో అమలులోకి రావడం జరిగింది. 

 ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్య కి సంబంధించి విధివిధానాలు రూపొందించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. 

నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాల విద్యకు సంబంధించి ప్రభుత్వం STARS Project ని తీసుకురావడం జరిగింది.. 

 ఈ ప్రాజెక్టుకు ఐదు వేల 5718 కోట్లు అంచనా వ్యయం కాగా ప్రపంచ బ్యాంకు ఈ కార్యక్రమానికి 3,700 కోట్ల మేర సహాయం అందించనుంది..

STARS - Strengthening Teaching Learning And Results for States. 

 ప్రధానంగా భారతీయ మూలాలను గుర్తించి ప్రపంచీకరణను అనుసంధానం చేస్తూ మానవ విలువలు,వ్యక్తిత్వ వికాసం, ఉత్తమ పౌరుడి లక్షణాలు అలవడి ఎందుకు పాఠశాల విద్య దశలోనే పిల్లల లో ప్రజ్ఞా పాటవాలను పెంచి వివేకవంతులు గా తీర్చి దిద్దాలని ఉద్దేశంతో బోధన అభ్యసన ఫలితాలను బలోపేతం చేసే దిశగా STARS Project ను తీసుకురావడం జరిగింది.. 

 బట్టీపట్టి చదివి పరీక్షలు రాయడం కాకుండా సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటూ నేర్చుకోవడం అనే ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు పేర్కొన్నారు. 

 21వ శతాబ్దపు పాఠశాల విద్య సదస్సులో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థులు అందుకుంటున్నది మార్కుల షీట్లు కావని అవి pressure sheets అని పేర్కొన్నారు. ఈ పరిణామాలను దూరం చేయడానికే నూతన జాతీయ విద్యా విధానం లో వివిధ మార్పులు తీసుకు వచ్చినట్లుగా చెప్పడం జరిగింది. 

STARS Project లో భాగంగా స్వయంప్రతిపత్తి గల 'సమగ్ర అభివృద్ధి కోసం సామర్థ్య అంచనా సమీక్ష జ్ఞాన విశ్లేషణ సంస్థ' ఏర్పాటు చేయడం జరిగింది. 

 దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలో బోర్డులు విద్యార్థుల పనితీరు అంచనా మూల్యాంకన కోసం స్వయం ప్రతిపత్తి సంస్థ నిబంధనలను రూపొందిస్తోంది. 

 మొదటగా హిమాచల్ప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కేరళ ఒరిస్సా రాష్ట్రాలలో పరివర్తన వ్యూహాలు మెరుగుపరచడం తమ అనుభవాలను ఇతర రాష్ట్రాలతో పంచుకోవడం ఈ సంస్థ పర్యవేక్షణలో జరుగుతుంది. 

 విద్య ఉపాధి అవకాశాలకు మనదేశంలో సారూప్యత చాలా తక్కువగా ఉన్న క్రమంలో వృత్తి విద్య పాఠశాల స్థాయిలోనే నూతన జాతీయ విద్యా విధానం లో నిబంధనలు తీసుకురావడం జరిగింది ఈ నిబంధనను అమల్లోకి తీసుకురావడం ఈ పథకంలో భాగంగా జరగబోతోంది. 

 2030 సంవత్సరం తర్వాత భారతదేశంలో సమగ్ర శిక్షణ పొందినవారు మాత్రమే ఉపాధ్యాయ నియామకాలు కు అర్హులు అని నిబంధనలు రూపొందించారు

 దేశంలో సరైన రోడ్డు సౌకర్యాలూ బస్సు సదుపాయాలు లేని ప్రాంతాల్లో సాంకేతికతను ఉపయోగించి రిమోట్ లెర్నింగ్ ద్వారా విద్యార్థలకు విద్యను అందించాలనే ప్రయత్నం జరుగుతోంది.  

ప్రస్తుతం విద్యా ఉమ్మడి జాబితాలోని అంశం కావడం వల్ల దేశంలో ఒకే దేశం ఒకే విద్యావిధానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అయితే భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతుల కారణంగా ఈ ప్రయత్నానికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు

Thursday, 12 November 2020

Reforms For Transperancy in Elections..ఎన్నికల విధానంలో పారదర్శకత పెంచడానికి సంస్కరణలు..

Reforms For Transperancy in Elections..ఎన్నికల విధానంలో పారదర్శకత పెంచడానికి సంస్కరణలు..

భారత దేశంలో ఎన్నికల వ్యవస్థలోఇప్పటి వరకు  వచ్చిన ప్రధానమైన సంస్కరణలు...

1.భారత రాజ్యాంగం భారత ప్రజలకు 326 ప్రకరణ ప్రకారం గా వయోజన ఓటు హక్కును కల్పించింది మౌలిక రాజ్యాంగంలో 21 సంవత్సరాలుగా ఉన్న వయోజన ఓటు హక్కు వయస్సును 61 వ రాజ్యాంగ సవరణ1988 ద్వారా 18 సంవత్సరాలకు తగ్గించారు మరియు 1993 నుండి ఓటర్ ఐడెంటిటీ కార్డులు ప్రవేశపెట్టారు. 
2. భారతదేశంలో 1952 సంవత్సరంలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి. మొదటి సారిగా ఎన్నికలు కావడంతో అన్ని అనుకున్న విధంగా పూర్తిస్యిలో ఎన్నికలను నిర్వహించగలిగారు.. కానీ కాలక్రమంలో 1957, 1962, 1967, 1971 ఎన్నికలలో నిదానంగా అక్రమాలు మొదలయ్యాయి అనగా ఎన్నికల్లో రిగ్గింగ్ బ్యాలెట్ బాక్సులు ఎత్తుకు వెళ్లడం దొంగ ఓట్లు వంటి అక్రమాలు సాధారణమైపోయాయి ఈ క్రమంలో ఎన్నికల వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలని భావించి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల వ్యవస్థను పరిశీలించి భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్(EVM) లను ప్రవేశపెట్టింది. 
3. 1980వ సంవత్సరంలో ECIL, BEL సంయుక్తంగా EVM లను తయారు చేశారు.. ఈవీఎంలను మొదటిసారిగా 1982 సంవత్సరంలో కేరళ లో నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా వినియోగించారు 1998 సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో ప్రయోగాత్మకంగా ఈవీఎంలను ఉపయోగించారు.
 1999 సంవత్సరంలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ అనేది జరిగింది 2004 సంవత్సరంలో కేంద్రంలో లోక్సభ ఎన్నికలను పూర్తిస్థాయిలో ఈవీఎంలు ఉపయోగించి నిర్వహించారు. 
4. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం లోని 49(O)సెక్షన్ ప్రకారం గా నెగటివ్ వోటింగ్ చర్చల్లోకి వచ్చింది
2004 PUCL vs UOI కేసులో SC తీర్పు : ఈవీఎంలలో NOTA బటన్ అందుబాటులో ఉంచాలని.. ఈ క్రమంలోనే 2013 Delhi అసెంబ్లీ ఎన్నికలలో NOTA అందుబాటులోకి తెచ్చారు. 
5.Voter Verifiable Paper Audit Trial--
Subramanyaswamy vs UOI కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గా భారతదేశంలో VVPAT అమల్లోకి వచ్చింది.. నాగాలాండ్ లోని నొక్సస్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలలో మొదటిసారిగా VVPAT అమలులోకి తెచ్చారు.. 
6. విధినిర్వహణలో ఉండి ఓటింగ్లో పాల్గొనలేని వారి కొరకు పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని 1999 నుండి అమలులోకి తీసుకొచ్చాడు
7. రక్షణ దళాల్లో పనిచేస్తున్న వారికి 2003 సంవత్సరం నుంచి Proxy vote అందుబాటులోకి తీసుకొచ్చారు
8. అయినప్పటికీ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత దేశంలో ఇప్పటికీ కేవలం 55 నుంచి 60 శాతం మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతోంది
 దీనికి పరిష్కారమే ఎలక్ట్రానిక్ వోటింగ్.
9. ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనగా online లోనే బ్యాలెట్ పత్రాన్ని తీసుకొని ఓటు వేసి సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ కి పంపగలగడమే.. 
10. ఇప్పటివరకు ఓటింగ్కు దూరంగా ఉంటున్నా విద్యావంతులు పారిశ్రామికవేత్తలు ధనికులు విదేశాలకు వెళ్లిన వారు ఉన్న వారు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు అందరూ ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా లభిస్తుందని అంచనా
ఈ ఎలక్ట్రానిక్ వోటింగ్ విధానాన్ని అమలులోకి తీసుకు రావాలంటే చేయాల్సిన చర్యలు---
1. పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాను రూపొం దించాలి
2. ఓటరు జాబితాను ఆధార్ సంఖ్య తో అనుసంధానం చేయాలి
3. ఆన్లైన్ లో బ్యాలెన్స్ మాత్రం డౌన్లోడ్ చేసుకునేందుకు ఆధార్ వెరిఫికేషన్ ని అందుబాటులోకి తీసుకురావాలి
4 సాధారణ ఎన్నికల్లో కూడా ఆధార్ వెరిఫికేషన్ ద్వారానే ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపడితే
 ఒకరి ఓట్లు ఇంకొకరు వేయడం ఒకే వ్యక్తి రెండు మూడు దగ్గర్లో ఓటు వేయడం వంటి అంశాలను నిరోధించవచ్చు
5. ఎన్నికల వ్యవస్థలో ఫేస్ రికగ్నిషన్ సిస్టం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ని పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకు రావచ్చు


Eenadu Editorial Analysis (21/11/20)..GST - వస్తు సేవల పన్ను.. దేశంలో పన్నుల వ్యవస్థను సరళతరం చేసిన GST - ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలు..

Eenadu Editorial Analysis (21/11/20).. GST - వస్తు సేవల పన్ను.. దేశంలో పన్నుల వ్యవస్థను సరళతరం చేసిన GST - ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలు...