Wednesday, 11 November 2020

PM SVAMITVA YOJANA ప్రధానమంత్రి స్వమిత్వ యోజన

Youtube Link
ఈరోజు భారతదేశంలో 6.62 లక్షల గ్రామాలు ఉన్నాయి.  2011 సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారంగా భారతదేశంలో 17.9 కోట్ల గృహాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయని అంచనా. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ గృహాలకు యజమానుల దగ్గర ధ్రువీకరణ పత్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ఈ క్రమంలో వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు వారి సమస్యలు తొలగించాలి మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆస్తుల రికార్డును పూర్తిస్థాయిలో ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి స్వమిత్వ యోజన అనే పథకాన్ని తీసుకు రావడం జరిగింది. 

ప్రధానమంత్రి స్వమిత్వ యోజన యొక్క ప్రధాన లక్ష్యం  గ్రామీణ ప్రాంతంలో ప్రజలకూ సమగ్ర ఆస్తి ధ్రువీకరణ పత్రాలు అందించాలి.

 2020 సంవత్సరం ఏప్రిల్ 24వ తారీఖున పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఆరు రాష్ట్రాల్లో 763 గ్రామాల్లో ఈ పథకం కింద సర్వే పూర్తి చేసి 1.32 లక్షల మందికి ధ్రువీకరణ పత్రాలు తయారు చేశారు. 

 పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకం విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో 2020 సంవత్సరం అక్టోబర్ 11 వ తారీకున నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించారు. 

 రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో దేశంలో అన్ని అన్ని గ్రామాలలో న ఆస్తులను పూర్తిస్థాయిలో సర్వే చేసి రికార్డు చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉంది 2020-21 సంవత్సరం లో 15.3%
2021-22 సంవత్సరంలో 37.4%
2022-23 సంవత్సరంలో 29.6%
2023-24 వ సంవత్సరంలో 17.8%
 పనులు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది

ప్రధానమంత్రి స్వమిత్వ యోజన కింద గుర్తింపుకార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ గుర్తింపు కార్డు కు ఒక యునిక్ ఐడి అనేది ఉంటుంది దీని ద్వారా ఆస్తుల వివరాలు పూర్తి స్పష్టత పూర్తి స్పష్టత తో అందుబాటులో ఉంటాయి. 

 ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. కేంద్రంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. రాష్ట్రాలలో రెవెన్యూ శాఖ మరియు ల్యాండ్ రికార్డ్స్ శాఖలు నోడల్ ఏజెన్సీ గా పనిచేస్తాయి. సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ పథకం అమలులో సాంకేతిక భాగస్వామిగా ఉండబోతున్నారు. 

 డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి వ్యక్తిగత ఆస్తుల సరిహద్దులు, గ్రామపంచాయతీ పరిధిలో చెరువులు, రోడ్లు, కాలువలు,  పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలు పరిగణలోకి తీసుకొని భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా సరిహద్దుల రూపొందిస్తారు. 

ప్రధానమంత్రి స్వమిత్వ యోజన ఉపయోగాలు

1. ప్రజల వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటు ప్రభుత్వ ఆస్తుల వివరాలు కూడా నమోదు చేయబడతాయి. 
2. గ్రామీణ ప్రజల ప్రాపర్టీని ఆర్థిక సంపదగా గుర్తించారు దీంతో బ్యాంకులో రుణాలు పొందడం సులభతరమౌతుంది. 
3. ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుంది తద్వారా గ్రామ పంచాయతీల నిధుల లేమి సమస్య తొలగిపోతుంది
4. దేశంలో మొత్తం ప్రజల ఆస్తి పై స్పష్టత అనేది పెరుగుతుంది. పారదర్శకత పెరుగుతుంది తద్వారా దేశ ప్రజల ఆస్తులపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన కలుగుతుంది

Tuesday, 10 November 2020

Foreign Contributions Regulating Act (FCRA) చట్టానికి సవరణలు.. స్వచ్ఛంద సంస్థల నిధుల నియంత్రణకు FCRA చట్టానికి సవరణలు..


Youtube Video Link

Foreign Contributions Regulating Act (FCRA) చట్టానికి సవరణలు.. స్వచ్ఛంద సంస్థల నిధుల నియంత్రణకు FCRA చట్టానికి సవరణలు.. 

1.లాభాపేక్ష లేకుండా అవసరంలో ఉన్నవారికి సహాయం అందించేవే స్వచ్ఛంద సంస్థలు.
2.స్వచ్ఛంద సంస్థల నుండి నిజాయితీ జవాబుదారితనాన్ని  ప్రభుత్వం ఆశిస్తోంది.
3.భారతదేశంలో FCRA చట్టాన్ని 1976లో చేశారు,దీనికి 2010 సంవత్సరంలో సవరణ చేశారు,మళ్లీ 2020 సంవత్సరంలో రెండవ సారి సవరణ చేశారు.
4.ఈ చట్టాన్ని రూపొందించడం లో ముఖ్య ఉద్దేశం ఏమనగా రాజకీయ పార్టీలకు విదేశీ నిధుల నియంత్రణ మరియు విదేశీ ప్రభుత్వాలు మనదేశంలో పెత్తనం చెలాయించడం నిరోధించాలి.
5.2010 సంవత్సరంలో చేసిన సవరణ ద్వారా పై అంశాలను పటిష్టంగా నిబంధనలు రూపొందించారు.వీటితో పాటు జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే అంశాలకు విదేశీ నిధులు వాడకూడదు అనే ముఖ్యమైన నిబంధనలు రూపొందించారు,మరియు విదేశీ నిధులు పొందాలనుకునే స్వచ్ఛంద సంస్థ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సంస్థ రిజిస్ట్రేషన్  రెన్యువల్ చేయించుకోవాలి మరియు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సంస్థ కు వచ్చిన నిధుల వివరాలను నమోదు చేయాలి. 
6. ఈ విధంగా నిబంధనలు రూపొందించిన తర్వాత విదేశీ విరాళాలు స్వచ్ఛంద సంస్థల ద్వారా దేశంలోకి రావడం పెరిగాయి,అయితే స్వచ్ఛంద సంస్థల పై నియంత్రణ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల 2020 సంవత్సరంలో సవరణ ద్వారా స్వచ్ఛంద సంస్థల నిధులను పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. 

2020 సవరణ ముఖ్యంశాలు :-
1. విదేశీ విరాళాలు పొందిన సంస్థ మాత్రమే వాటిని వినియోగించాలి ఇతర సంస్థలకు బదిలీ చేయకూడదు.
2. విదేశీ నిధుల లో పరిపాలనాపరమైన వ్యయాన్ని 20 శాతానికి నియంత్రించుకోవాలి.
3. ప్రతి స్వచ్ఛంద సంస్థ తప్పనిసరిగా ఢిల్లీలోని sbi లో ఖాతా తెరవాలి.
4. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారు విదేశీ విరాళాల పొందడానికి అనర్హులు.
5. ప్రతి స్వచ్ఛంద సంస్థ సంవత్సరానికి ఒకసారి తమ యొక్క రిజిస్ట్రేషన్ ను రెన్యూవల్ చేసుకోవాలి అంతేకకుండా రిజిస్ట్రేషన్  Renewal చేసుకొనే సమయంలో బోర్డు సభ్యుల యొక్క ఆధార్,passport వంటి పత్రాలను ప్రభుత్వానికి సమర్పించాలి.ఒకవేళ సంస్థ వీటిలో ఏవి సమర్పించక పోయినా సంస్థ యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయబడదు. 

 2020 సంవత్సరం లో ఈ నిబంధనలు రూపొందించడానికి కారణాలు :-
1. ఈ రోజు భారతదేశం లో రిజిస్టర్ చేసుకున్న స్వచ్ఛంద సంస్థల్లో పదిశాతం కూడా audit report ను  చేయట్లేదు.దీని వల్ల పెద్ద మొత్తంలో అవకతవకలకు ఆస్కారం పెరుగుతోందని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిబంధనలను రూపొందించింది.
2. 2014 intelligence bureau నివేదిక ప్రకారంగా దేశంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు గా ఉన్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్,  గ్రీన్ పీస్ సంస్థలు పెద్ద మొత్తంలో నిధులు లో అవకతవకలకు పాల్పడ్డారని మరియు అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చాయని ఆరోపణ వచ్చింది. అంతేకాకుండా ఈ సంస్థలు చేపట్టిన ఈ చర్యల వల్ల దేశ జి.డి.పి 2 నుంచి 3 శాతం తగ్గింది అని IB Report తెలిపింది. 
3. దేశంలో ఈ రోజు 32 లక్షల పైచిలుకు స్వచ్ఛంద సంస్థలు ఉన్నప్పటికీ ఇందులో చాలా సంస్థలు రెండు లేదా మూడు FCRA Numbers కలిగి ఉన్నాయని,దీనివల్ల అవకతవకలకు ఆస్కారం పెరుగుతుంది అని ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఆలోచన. 
 
ఇవన్నీ అంశాలకు పరిష్కారమే ప్రస్తుతం FCRA చట్టానికి చేసిన సవరణలు.. 

Sunday, 8 November 2020

Wages Code, కార్మిక చట్టాల సవరణ - వేతన కోడ్ -2019

Youtube Link


Wages Code, కార్మిక చట్టాల సవరణ - వేతన కోడ్ -2019

(1)2019 ఆగస్ట్ 8 న వేతనాలకు సంబంధించిన చట్టాలు,బోనస్ చట్టాలను కలిపి వేతనాల కోడ్ -2019
(2) ఈ వేతనాలు కోడ్ /wages code చట్టం లో ఇప్పటివరకు ఉన్న 
వేతన చెల్లింపుల చట్టం -1936, 
కనీస వేతనాల చట్టం -1948, 
బోనస్ చెల్లింపుల చట్టం-1965, 
సమాన వేతన చట్టం -1976 వంటి చట్టాలను ఇందులో కలిపారు
(3)కార్మిక సంఘాలు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎన్నో హక్కులని ఈ యొక్క కోడ్ తొలగించి వేసిందని కార్మిక సంఘాలు మరియు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
4) కార్మిక సంఘాల అభ్యంతరాలను పట్టించుకోకుండా పారిశ్రామికవేత్తల డిమాండ్కు అనుకూలంగా ఈ వేతన కోడ్ లో  మార్పులు చేశారని కార్మిక సంఘాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి
5) భారతదేశంలో వేతనాలపై ఆధారపడ్డ 45.5 కోట్ల కార్మికులు దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది అని నిపుణుల అంచనా
6) NSSO సర్వే ప్రకారం భారతదేశంలో వేతనం పై ఆధార పడ్డ వారిలో 72 శాతం మంది వేతనం 18000 కంటే తక్కువ. ఇందులో 45 శాతం మంది యొక్క వేతనం 10,000 కంటే తక్కువ
7) భారతదేశంలో 1980వ సంవత్సరంలో ఉత్పత్తిలో కార్మికుల యొక్క వాటా 28.5 శాతంగా ఉంది. ఇదే సంఖ్య 2018 కి 10.9 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో అనగా 1980 నుంచి 2018 మధ్యలో యజమానుల యొక్క లాభాలు 45.2 శాతం పెరిగాయి. 

 ఈ వేతన కోడ్ లోని ముఖ్యమైన అంశాలు
1. కనీస వేతనాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని మార్పు చేశారు.. ఇంతవరకు ఇది కనీస ధరలకు అనుగుణంగా నిర్ణయించబడే ది.. 
2. కనీస వేతనాలను గంటల/ రోజులు/ నెలల వారిగా నిర్ణయించి అమలు పరిచే విధానాన్ని తీసుకొచ్చారు.  దీనివల్ల కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత తొలగిపోతుంది అని మరియు  PF, ESI, బోనస్ వంటి benefits కార్మికులకు దూరమవుతాయని కార్మిక సంఘాల యొక్క ప్రధానమైన ఆరోపణ
3) ఇంతకు ముందు ఉన్న చట్టాల ప్రకారం గా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగాలి కానీ అది కూడా ఇప్పుడు అమలు కావడం లేదు.. 
4) wages code కి సంబంధించి పార్లమెంటులో చర్చ జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్లో నియమించిన expert కమిటీ దేశంలో unskilled worker యొక్క కనీస వేతనం 8862 రూపాయల నుండి 11622 రూపాయల మధ్య ఉండాలని సూచించింది కానీ ప్రభుత్వం చట్టంలో National floor level wage ని 178 రూ/day గా నిర్ణయించింది.. 
5)19th indian labour conference ప్రకారంగా భారతీయ శ్రామికుడు పని చేయాలంటే 2700 కేలరీల శక్తినిచ్చే ఆహారం, ఏడాదికి కుటుంబానికి 72 గజాల బట్ట అవసరం అని, వేతనం లో 20%విద్యుత్, ఇంధన ఖర్చు గా ఉండాలని, పారిశ్రామిక హౌసింగ్ స్కీం ప్రకారం ఇంటి అద్దె ఉండాలని చెప్పింది
6) దీని ప్రకారం గా ప్రస్తుతం 25 వేల రూపాయల కనీస వేతనం ఉండాలి కానీ ప్రస్తుతం ప్రభుత్వం నూతన చట్టంలో ఈ అంశాన్ని అమలు పరచలేదు
7) 7 వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 18 వేల రూపాయల కనీస వేతనం కూడా కార్మికులకు లభించలేదు
8) కనీస వేతనాలు అమలు తీరుపై పర్యవేక్షణ వ్యవస్థను తనిఖీల వ్యవస్థను మార్పు చేసి దానిని inspector cum felicitator గా మార్చారు.. 
9) ఇంతవరకూ సాధారణ పరిస్థితులు ప్రమాదకర పరిస్థితులు అనే కేటగిరి ఉండేది ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసేవారికి ఎక్కువ వేతనం లభించేది
నూతన చట్టం ప్రకారం సాధారణ పరిస్థితులు ప్రమాదకర పరిస్థితులు రెండింటినీ ఒకే కేటగిరీకి మార్చారు. దీనివల్ల ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే కార్మికుని కి ఎక్కువ వేతనం లభించే అవకాశం లేదు
9) 15 వేల రూపాయల కంటే ఎక్కువ వేతనం లభించే కార్మికుడిని supervisor గా మార్పు చేశారు తద్వారా supervisor గా ఉన్న వ్యక్తి కార్మికుల యొక్క benefits పొందలేడు.. 
10) ఈ నూతన చట్టం ప్రకారం గా కార్మికుల యొక్క వేతనాలు పనిగంటల మార్పు తనిఖీల వ్యవస్థను నిర్వహించడం పట్ల International Labour Organization తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం జరిగింది

 మొత్తం మీద ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్మిక చట్టాలు కార్మికుల యొక్క హక్కులను పెద్ద మొత్తంలో ఉల్లంఘిస్తున్నారని నవంబర్ 26వ తారీఖున దేశం మొత్తంలో కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడం జరిగింది తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాటానికైనా సిద్ధమని చెప్పి కార్మికులు ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా ఉన్న కార్మికుల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతగానో ఉంది కాబట్టి ఈ కార్మిక చట్టాల్లో అవసరమైన మేరకు మార్పులు చేయాల్సి ఉందని నిపుణుల యొక్క అభిప్రాయం. 

వ్యవసాయరంగంలో పెరుగుతున్న సమస్యలు, రైతుకు లభించని గిట్టుబాటు ధరలు, కొరవడిన ప్రణాళికలు, పెరుగుతున్న దిగుమతులు


వ్యవసాయరంగంలో పెరుగుతున్న సమస్యలు, రైతుకు లభించని గిట్టుబాటు ధరలు, కొరవడిన ప్రణాళికలు, పెరుగుతున్న దిగుమతులు 

(1)ప్రజలకు నిత్యావసరాల్ని సరైన ధరకు అందించి ఆహారభద్రత కల్పించలేని ఏ దేశమూ ఆర్థికాభివృద్ధి సాధించలేదు. 
(2)కొన్ని పంటల దిగుబడులలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం అయినా ప్రజలకు సరైన ధరకు ఆహార పదార్థాలు అందడం లేదు, మరియు పూర్తిస్థాయిలోఎగుమతులు చేయడం లేదు. 
(3)ఆహారోత్పత్తుల ధరలను స్థిరీకరించాలంటే శుద్ధి, నిల్వసదుపాయాలు అత్యంత ఆవశ్యకం. ఇవి పూర్తిగా అందుబాటులోలేని దేశాల్లోనే ధరలు పెరుగుతాయి.
(4)వ్యవసాయ ఆహార ఉత్పత్తులు పెంచడానికి 2018లో 8 రకాల పంటలకు ఎగుమతి ప్రోత్సాహక వేదికను కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. 
ఉల్లి,ద్రాక్ష,అరటి,బియ్యం,మామిడి,తృణధాన్యాలు, దానిమ్మ,పువ్వులు వీటికి ఎగుమతి ప్రోత్సాహక వేదికను ఏర్పాటు చేశారు.
(5)2020 సెప్టెంబర్ లో ఆమోదించిన నిత్యావసర సరుకుల చట్టం సవరణని పక్కనపెట్టి ప్రస్తుతం ఉల్లి పంట విషయంలో మళ్ళీ ఆంక్షలు విధించారు. 
(6)2019లో ఉల్లి ధర 200 కు చేరడంతో,ఉల్లి ఎగుమతిపై కేంద్రం ఆంక్షలుకేంద్రం విధించింది.. గత సంవత్సరం పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని  కేంద్రం 1లక్ష టన్నులు స్టోర్ చేస్తే అందులో 25,000 టన్నులు కుళ్లిపోయిన పరిస్థితి.. దీనికి కారణం భారతదేశంలో శుద్ధి సదుపాయాలు లేకపోవడం..
(7)2020 మొదటి త్రైమాసికంలో భారత్ లో 6.8లక్షల టన్నులు ఉల్లి ఎగుమతి చేసింది, కానీ ప్రస్తుతం మళ్లీ దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉంది..దేశంలో కురిసిన అధిక వర్షాల కారణంగా పంట నష్టాల వల్ల సెప్టెంబర్ లో ఎగుమతులపై నిషేధం విధించారు.ప్రస్తుతం మళ్ళీ ధరలు కిలోకి 100 రూపాయలకి పెరిగాయి, ఈ క్రమంలో ఆఫ్ఘానిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 
(8)గత సంవత్సరం దేశంలో 2.44కోట్ల టన్నుల దిగుబడి అయినా ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయి, కారణం మనం నిల్వ చేసుకోలేకపోవడం..
(9)ప్రభుత్వ వ్యవసాయశాఖ అంచనా ప్రకారం క్వింటాల్ వరి  ధాన్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు 2529 రూపాయలు/క్వింటాల్  కానీ కనీస మద్దతు ధర నిర్ణయించే CACP వారి ప్రకారం మద్దతు ధర 1888 రూపాయలు/క్వింటాల్
(10)ప్రత్తి సమగ్ర ఉత్పత్తి వ్యయం 9469/క్వింటాల్
CACP వారి ప్రకారం మద్దతు ధర  5825/క్వింటాల్
(11) ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY, వాతావరణ ఆధారిత పంటల భీమా అమలు జరగడం లేదు.
(12) బీమా సదుపాయం లేక పోవడం వల్ల రైతు కు నష్టం పెరుగుతోంది 
(13)2019-20 తో పోల్చితే sunflower oil దిగుమతి ధర టన్నుకు 55000 నుంచి 75000 కి పెరిగింది. 
(14)వంట నూనెల దిగుమతులకు ప్రతి సంవత్సరం మనం వెచ్చిస్తున్న మొత్తం 70000 కోట్లు..
(15)2019 నవంబర్ - 2020 సెప్టెంబర్  కి 31.06 లక్ష టన్నుల సొయా నూనె, 23.48లక్ష టన్నుల sunflower ఆయిల్ దిగుమతులు మనం చేసుకున్నాము..

 ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే..

(a)ప్రాంతాల వారీగా క్లస్టర్స్ ఏర్పాటు చేయాలి 
(b)రైతులకు మద్దతు ధరలను ప్రోత్సహించాలి
(c)పంట నష్టాలకు భీమా కల్పించేలా చర్యలు 
(d)మార్కెట్ సదుపాయాలు పెంచాలి 

Wednesday, 4 November 2020

Growing Trend of Cancer Disease in India దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

Youtube Link Growing Trend of Cancer Disease in India 
దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు 

(1)ఒక కణంలో వచ్చే అవాంఛిత పెరుగుదలను క్యాన్సర్ అంటారు. 
(2)2020 ICMR నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం 13.9లక్షల నూతన క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. 2025 కల్లా ప్రతి సంవత్సరం కొత్తగా 15.7 లక్షలు గా పెరగొచ్చని అంచనా. 
(3)దేశంలో సగటున ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 
(4)భారత దేశంలో క్యాన్సర్ సోకిన వారిలో ప్రతి 15 మందిలో ఒకరు మరణించే అవకాశం ఉంది.
(5)దేశంలో ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసుల్లో పెరుగుదల 12% గా ఉంది. 
(6)దేశంలో క్యాన్సర్ కేసులు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి, మహారాష్ట్రలో ఉస్మానాబాద్,బీడ్ జిల్లాల్లో తక్కువ కేసులు నమోదు.
(7స్త్రీలలో BREAST CANCER,CERVICAL CANCER, MOUTH CANCER,  
పురుషులలో LUNG CANCER,mouth cancer, జీర్ణకోశ సంబంధిత cancer ఎక్కువగా కనిపిస్తున్నాయి.. 
(8)పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల 27.1% మందికి క్యాన్సర్ లు,జీర్ణకోశ సంబంధ క్యాన్సర్స్ 19.7%, సర్వైకల్ క్యాన్సర్ 5.4% గా ఉన్నాయి. 
(9)ప్రతి సంవత్సరం సగటున 7.8 లక్షల మంది క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు.  
(10)క్యాన్సర్ సోకిన తర్వాత 85% మంది స్వంత ఖర్చుతో వైద్యం చేయించుకుంటున్నారు, దీనికి కారణం ప్రభుత్వ హాస్పిటల్స్ లో క్యాన్సర్స్ ట్రీట్మెంట్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉంది.
(12)2019 parliamentary committee on science and technology,Environment 
రిపోర్ట్ ప్రకారం ఇండియాలో  క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి,ప్రజలపై పడుతున్న burden పెరుగుతోంది.. వీటిని తగ్గించాలి అని కొన్ని సూచనలు చేసింది.. 
(A)ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి.
(B)చిన్న నగరాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అందుబాటులోకి తీసుకురావాలి.
(C)ప్రాథమిక దశలో క్యాన్సర్ ని గుర్తించేలా అవగాహన చేపట్టాలి.
(D)ప్రభుత్వ ఆరోగ్య భీమాల్లో క్యాన్సర్ కి కేటాయింపులు పెంచాలి.
(E)క్యాన్సర్ కి సంబంధించిన విభాగాల్లో పీజీ సీట్లు పెరగాలి.
(F)ప్రైవేట్ హాస్పిటల్ లో సేవలకు ధరలను ప్రభుత్వం regulate చేయాలి.
(G)క్యాన్సర్ మందుల ధరల రేట్లను ప్రభుత్వం regulate చేయాలి.
 Eg: Pemtrexed - lung cancer medicine 
 500 mg 28000/- నుంచి regulate ఐయ్యాక   2800 కి తగ్గింది. 

Monday, 2 November 2020

5G TECHNOLOGY IN INDIA , భారతదేశంలో 5G సాంకేతికత అమలుకు సన్నాహాలు & అవరోధాలు




5G TECHNOLOGY IN INDIA
భారతదేశంలో 5G సాంకేతికత అమలుకు సన్నాహాలు & అవరోధాలు 

(1) ప్రపంచంలో 5G Technology 40కి పైగా దేశాల్లో ఉంది.చైనా,సౌత్ కొరియా దేశాల్లో 5G technology పూర్తి స్థాయిలో ఇప్పటికే అందుబాటులో ఉంది.
(2) 2022 కల్లా పూర్తిస్థాయిలో 5G సాంకేతికత దేశంలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. 
(3) 1980 వ దశకంలో ->1G సేవలు అందుబాటులోకి వచ్చాయి .. దీనిద్వారా Voice Calls సాధ్యం అయ్యేవి..తర్వాత 1990-2000 వ దశకంలో->2G,2.5G సేవలు అందుబాటులోకి వచ్చాయి .. దీనిద్వారా:Voice Calls+Messages+Data[16kbps] సాధ్యం అయ్యేవి.. తర్వాత 2000 దశకంలో ->3G సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిద్వారా :Voice Calls+Messages+Data[1-2mbps]+Video Calls సాధ్యం అయ్యేవి.. ఆ తర్వాత 2009 లో - >4Gసేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిద్వారా:VoiceCalls+Messages+Data[100mbps]+Video Calls సాధ్యం అయ్యేవి..ప్రస్తుతం 5G సేవలు ->4G కంటే 100 రెట్ల వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కలిపిస్తాయి.. 10Gbps వేగంతో ఇంటర్నెట్ లభించును.. 
(4) 5G తో అత్యధిక వేగం, తక్కువ latency,ఎక్కువ కనెక్టివిటీ సాధ్యం మరియు 4G కంటే 5G తో 10 రెట్ల సమయం ఆదా అవుతుంది.
(5) 5G తో 1sq.km area లో 10లక్షల పరికరాలను కనెక్ట్ చేయవచ్చు.
(6) 5G Spectrum రేంజ్ ఇండియా లో :3400-3800MHz Band
వేలం కి 1MHz కి 7కోట్లUS$[512cr.]గా ప్రభుత్వం నిర్ణయం tisukundi..అదే 1Mhz కి 
సౌత్ కొరియా లో ->132cr. UK లో ->73cr. AUS లో ->37cr. గా ఉంది. 
(7) 5G సాంకేతకతను అందుబాటులోకి తేవడానికి అవసరం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 1లక్ష కోట్లు అయ్యే అవకాశం 
భారత్ లో Qualcom, హువావే, Nokia,verizon వంటి సంస్థ లు 5g ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేయడానికి సిద్ధం గా ఉన్నాయి ..
ఐతే ఇటీవల Reliance కంపెనీ పూర్తి దేశీయ పరిజ్ఞానం తో 5g సాంకేతికత అభివృద్ధి చేస్తున్నట్టుగా ప్రకటించింది.. 

(8)ఇంత పెద్ద మొత్తం లో ఖర్చు పెట్టాక కంపెనీలు 5gTariff ధర లను పెంచే అవకాశం ఉంది ->దేశంలో 95% ప్రీపెయిడ్ కస్టమర్స్ ఉన్న క్రమంలో టారిఫ్ ధరలు ఎక్కువ ఐతే వినియోగదారు లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది..  
(9) నూతన 5G మొబైల్స్ అవసరం
ప్రస్తుతం భారత్ లో average cost స్మార్ట్ ఫోన్ కి  :12,000.. 
అదే 5G mobiles కి :30,000.
వినియోగదారులు 5g కి ఆకర్షితులు అవుతారా అనేది సందేహంగా ఉన్న పరిస్థితి..  

Sunday, 1 November 2020

REFORMS IN RAILWAY SECTOR రైల్వే రంగంలో సంస్కరణల దిశగా పడుతున్న అడుగులు

Youtube Video Link

 REFORMS IN RAILWAY SECTOR

రైల్వే రంగంలో సంస్కరణల దిశగా పడుతున్న అడుగులు

  • స్వాతంత్రం లభించినప్పుడు సంస్థానాలు,బ్రిటిష్ ఇండియా ఆధీనంలోని 42 లైన్లను ఇండియన్ రైల్వేగా ఏర్పాటు చేసారు  
  • ప్రస్తుతం దేశంలో 13 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ,రోజుకు 25 కోట్ల మందికి రవాణా సదుపాయం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే 
  •  ప్రపంచంలో రైల్వే నెట్ వర్క్ లో->భారత్ 4వస్థానం->రష్యా,అమెరికా,చైనా మొదటి 3 స్థానాలు 
  • భారత్ లో->109 మార్గాల్లో->151 రైళ్లను ప్రైవేటైజషన్ కి బిడ్స్ ఆహ్వానించారు 
  • 2012 లో VIBRANT GUJARAT సదస్సు->నరేంద్ర మోడీ గారు->దేశంలో ప్రైవేట్ వాహనాలు,ప్రైవేట్ విమానాలు ఉన్నప్పుడు ప్రైవేట్ రైళ్లు ఎందుకు ఉండకూడదు???
  • 2015 ->బిబేక్ దేబ్రాయ్ కమిటీ->రిపోర్ట్->ప్రైవేటీకరణకు అనుమతించాలని చెప్పింది,ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలు కోరుకునేవారికి ఎక్కువ రుసుముతో సేవలు అందించడానికి ప్రైవేటీకరణతో అవకాశం
  •  నీతిఆయోగ్ CEO చైర్మన్ గా->సాధికార కమిటీ->రైల్వే ప్రైవేటీకరణ,రైల్వేఆధునీకీకరణ గురించి-> ప్రైవేటీకరణకు అనుమతించాలని చెప్పింది
  • దేశంలో రైల్వేలో 12 క్లస్టర్స్ లో ప్రైవేటైజషన్ రైళ్లకు బిడ్స్ ఆహ్వానం 
  • ఇండియన్ రైల్వే->డ్రైవర్,గార్డ్ ని అందిస్తుంది ->మిగతా అన్నిసదుపాయాలు ప్రైవేట్ సంస్థ సమకూర్చుకోవాలి.
  • ప్రైవేట్ సంస్థ->రైలు బోగీలు,ఇంజిన్స్ ను సమకూర్చుకోవాలి,రేట్లు ఫిక్స్ చేసుకోవచ్చు 
  • 2 ప్రైవేట్ రైళ్లు->IRCTC నేతృత్వంలో->తేజస్ పేరుతో->ఢిల్లీ-లక్నో, ముంబై-అహ్మదాబాద్>విజయవంతంగా నడుస్తున్నాయి..
  • ప్రైవేట్->బిడ్డింగ్ లో->120 సంస్థలు బిడ్డింగ్ దాఖలు->L&T,SIEMENS,ALSTOM వంటి సంస్థలు బిడ్డింగ్ లోపాల్గొన్నాయి.పెద్ద మొత్తంలో లాభాలకు అవకాశం ఉందనే ఈ సంస్థలు బిడ్డింగ్ లోపాల్గొన్నాయి
  • ఒక స్వతంత్ర రెగ్యూలేటర్ ని నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఆ రేగులటరీ యొక్క బాధ్యతల గురించి ఎలాంటి స్పష్టత లేదు 
  • రైల్వేలో 4 సంవత్సరాలలో 30,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రైవేట్ సంస్థలు చెప్తున్నాయి కానీ ఇంత మొత్తంలో పెట్టుబడులు పెట్టాక ఈ సంస్థలు లాభార్జనే ధ్యేయంగా పని చేస్తాయి 
  • ప్రైవేట్ రైళ్లలో సాధారణ,స్లీపర్ బోగీలు ఉండవు కేవలం AC బోగీలు మాత్రమే ఉంటాయి..కాబట్టి సామాన్యుడు భరించే పరిస్థితి ఉండకపోవచ్చనేది నిపుణుల ఆలోచన 

Eenadu Editorial Analysis (21/11/20)..GST - వస్తు సేవల పన్ను.. దేశంలో పన్నుల వ్యవస్థను సరళతరం చేసిన GST - ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలు..

Eenadu Editorial Analysis (21/11/20).. GST - వస్తు సేవల పన్ను.. దేశంలో పన్నుల వ్యవస్థను సరళతరం చేసిన GST - ఇంకా దృష్టి సారించాల్సిన అంశాలు...